Supreme Court | అర్హత లేనివారిని ఉపాధ్యాయులుగా నియమించొద్దు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court | విద్యాసంస్థల్లో అర్హత లేని ఉపాధ్యాయుల నియామకాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టపరమైన నిబంధనల ప్రకారం అనర్హులను ఉపాధ్యాయులుగా నియమించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
Supreme Court | త్రినేత్ర.న్యూస్ : విద్యా సంస్థల్లో అర్హత లేని ఉపాధ్యాయుల నియామకాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యా హక్కు చట్టం (RTE), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) చట్టం, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలు లేని వ్యక్తులను పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయులుగా నియమించరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అస్సాం ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా, పారదర్శకత లేకుండా ఉపాధ్యాయులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ (CJI Surya Kant), జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. చట్టపరమైన నిబంధనల ప్రకారం అనర్హులను ఉపాధ్యాయులుగా నియమించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న వారిని కూడా కొనసాగించడానికి వీల్లేదని పేర్కొంది. అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ధర్మాసనం ఈ సందర్భంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టెట్ (TET), నెట్ (NET), నెట్ (NET) వంటి జాతీయ స్థాయి అర్హత పరీక్షలు పాసైన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకోవాలని తేల్చి చెప్పింది. అర్హత లేని టీచర్ల నియామకంపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read..
బ్రిక్స్ సమ్మిట్.. ఈనెల 11న మోదీ-పుతిన్ భేటీ
రణరంగంగా అసెంబ్లీ పరిసరాలు: ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, సర్వేయర్ల ముట్టడి
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aravalli Range | నా రిటైర్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారా..? ఆరావళిపై హైపవర్ కమిటీకి సుప్రీంకోర్టు డెడ్లైన్
సెప్టెంబర్ 7, 2026

Deviprasad | మూడేండ్లలో ఒక్క హామీ అమలు చేయలే.. మరో రెండేండ్లు అడగడం అమానుషం: దేవీప్రసాద్
సెప్టెంబర్ 6, 2026

Revanth Reddy | రెండేండ్లు సమయమివ్వండి.. టీచర్లకు సీఎం రేవంత్ విజ్ఞప్తి
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●BRS, Congress Mutual attack | రణరంగంగా బోయిన్పల్లి పీఎస్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర దాడి
- ●Gaddam Prasad | స్పీకర్ పరిధి కాదంటే ఎలా?
- ●BRICS Summit | బ్రిక్స్ సమ్మిట్.. ఈనెల 11న మోదీ-పుతిన్ భేటీ
- ●Telangana Women's Commission | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్కు కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు
- ●Pithapuramlo | సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో… అలా మొదలైంది’
- ●BJP Memorandum to Governor | ఫీజు బకాయిలు విడుదలయ్యేలా చూడండి.. గవర్నర్కు బీజేపీ వినతి

BRS, Congress Mutual attack | రణరంగంగా బోయిన్పల్లి పీఎస్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర దాడి

Gaddam Prasad | స్పీకర్ పరిధి కాదంటే ఎలా?

BRICS Summit | బ్రిక్స్ సమ్మిట్.. ఈనెల 11న మోదీ-పుతిన్ భేటీ

Telangana Women's Commission | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్కు కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు



