త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vice President | 17న హైద‌రాబాద్‌కు ఉప రాష్ట్ర‌ప‌తి.. ఏర్పాట్ల‌పై సీఎస్ స‌మీక్ష‌

Vice President | భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ ఈ నెల 17న హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై స‌చివాల‌యంలో సంబంధిత కార్యదర్శులు, పోలీసు అధికారులతో సీఎస్ సంజ‌య్ జాజూ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

S

Telangana | Published On Sep 15, 2026, 5.26 pm IST

Vice President | 17న హైద‌రాబాద్‌కు ఉప రాష్ట్ర‌ప‌తి.. ఏర్పాట్ల‌పై సీఎస్ స‌మీక్ష‌
Advertisement

Vice President | త్రినేత్ర‌.న్యూస్ : భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ ఈ నెల 17న హైద‌రాబాద్ న‌గ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ క్ర‌మంలో ఉపరాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై స‌చివాల‌యంలో సంబంధిత కార్యదర్శులు, పోలీసు అధికారులతో సీఎస్ సంజ‌య్ జాజూ మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఈనెల 17న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ వస్తున్నారని తెలిపారు. 17న ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకొని ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖలు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నాయని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, హైదరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమీషనర్లు సజ్జనార్, సుమతి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ ముకుంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement