Oracle | ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే.. లేవగానే ఉద్యోగులకు పిడుగులాంటి వార్త చెప్పిన ఒరాకిల్
Oracle | అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ (Oracle) మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. Today is your last working day అంటూ పలువురు ఉద్యోగులకు ఇవాళ ఉదయం 6 గంటలకే మెయిల్స్ పంపింది.
Oracle | త్రినేత్ర.న్యూస్ : అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ (Oracle) తన ఉద్యోగులకు షాకిచ్చింది (Oracle Layoffs). మరోసారి లేఆఫ్స్‌ను (Layoffs) మొదలు పెట్టింది. Today is your last working day అంటూ పలువురు ఉద్యోగులకు తెల్లవారగానే ఈమెయిల్స్ పంపింది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు సమాచారం అందించింది.
బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక ప్రకారం.. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు ఒరాకిల్ సంస్థ మెయిల్స్ పంపుతోంది. ఈ విషయాన్ని లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగులు లింక్డిన్ (LinkedIn), రెడ్డిట్ (Reddit), బ్లైండ్ (Blind) వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకున్నారు. అయితే ఈ తాజా లేఆఫ్స్‌లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే ఖచ్చితమైన సమాచారం మాత్రం తెలియరాలేదు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ఈ టెక్ దిగ్గజం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఒరాకిల్ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం కోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఏఐ కోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సంస్థకు దాదాపు 156 బిలియిన్ డాలర్లు అవసరం ఉంది. ఈ ఖర్చులు ఇప్పుడు కంపెనీ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్ ఏఐ వంటి ప్రముఖ కంపెనీల కోసం భారీ డేటా సెంటర్లను నిర్మిస్తుండటంతో ఒరాకిల్‌పై ఆర్థిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చులను తట్టుకోవడంతో పాటు నగదు నిల్వలను కాపాడుకునేందుకు ఒరాకిల్ లేఆఫ్స్ వైపు మొగ్గు చూపుతోంది.
ఇందులో భాగంగానే నిధుల ఆదా కోసం గత 12 నెలల వ్యవధిలోనే ఒరాకిల్ దాదాపు 21వేల మందిని తొలగించిన విషయం తెలిసిందే. కాగా, ఒరాకిల్‌లో గతేడాది సుమారు 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా.. ఈ ఏడాది మే 31 నాటికి ఆ సంఖ్య 1,41,000కు పడిపోయింది. ఇందులో 49,000 మంది అమెరికా ఉద్యోగులు కాగా, అంతర్జాతీయంగా దాదాపు 92 వేల మంది పనిచేస్తున్నారు.
Also Read..
రూ.2వేలు దాటితే యూపీఐ చార్జీలు చెల్లించాలా.. కేంద్రం స్పష్టత..
సంబంధిత వార్తలు

Dusha Salian Murdered Case | దిశా శాలియన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్లో మాజీ సీఎం కొడుకు, నటుల పేర్లు
సెప్టెంబర్ 14, 2026

AI | ఏఐతో మానవాళికి ముప్పే.. ఆంథ్రోపిక్ సీఈవో సంచలన వ్యాఖ్యలు..
సెప్టెంబర్ 14, 2026

Oracle | ఒరాకిల్‌లో మరోసారి లేఆఫ్స్.. ఇందుకోసం 700 మిలియన్ డాలర్ల ఖర్చు
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●KTR | తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్న పోలీసు శాఖ: కేటీఆర్
- ●Gurugram Hit and Run Case | గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసు: నిందితుడు చిక్కాడు.. పదేళ్ల జైలు తప్పదా?
- ●Global Village Dubai | గ్లోబల్ విలేజ్ 31వ సీజన్.. అక్టోబర్ 14 నుంచి సందడి..
- ●Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
- ●Power Cut | విద్యుత్ బకాయిలపై ఉక్కుపాదం.. 747 గవర్నమెంట్ ఆఫీసులకు కరెంట్ కట్!
- ●Uniform Civil Code | UCC అమలుకు ముందే ఎన్డీయేలో లొల్లి.. అమిత్ షా ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

KTR | తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తున్న పోలీసు శాఖ: కేటీఆర్

Gurugram Hit and Run Case | గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసు: నిందితుడు చిక్కాడు.. పదేళ్ల జైలు తప్పదా?

Global Village Dubai | గ్లోబల్ విలేజ్ 31వ సీజన్.. అక్టోబర్ 14 నుంచి సందడి..

Gold And Silver Prices Today | అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..



