త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chilkur Balaji Temple | రైతులు సుభిక్షంగా ఉండాల‌ని.. చిలుకూరు బాలాజీ దేవాలయంలో వరుణ జపం

Chilkur Balaji Temple | రాష్ట్ర‌వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాల‌ని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ చిలుకూరు బాలాజీ దేవాల‌యం (Chilkur Balaji Temple) ఆధ్వ‌ర్యంలో వ‌రుణ జ‌పం (Varuna Japam) నిర్వ‌హించ‌నున్నారు.

G

Telangana | Published On Jul 20, 2026, 11.08 am IST

Chilkur Balaji Temple | రైతులు సుభిక్షంగా ఉండాల‌ని.. చిలుకూరు బాలాజీ దేవాలయంలో వరుణ జపం
Advertisement

Chilkur Balaji Temple | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్ర‌వ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాల‌ని, సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ చిలుకూరు బాలాజీ దేవాల‌యం (Chilkur Balaji Temple) ఆధ్వ‌ర్యంలో ఉస్మాన్‌సాగ‌ర్ (Gandipet) జ‌లాశ‌యంలో వ‌రుణ జ‌పం (Varuna Japam) నిర్వ‌హించ‌నున్నారు. మంగ‌ళ‌వారం (జూలై 21) ఉదయం 8.30 నుంచి 11 గంటల ఈ కార్య‌క్ర‌మం జ‌రుగనుంది.

వేదభవనంకు చెందిన డాక్ట‌ర్ శ్రీరామ ఘనపాటి నాయకత్వంలో ఋత్వికులు తైత్తిరీయ సంహితలోని వరుణ జప మంత్రాలను సంప్రదాయబద్ధంగా 108 సార్లు పారాయణం చేస్తారు. శ్రీ చిలుకూరు బాలాజీ అనుగ్రహంతో వరుణదేవుడు, ఇంద్రదేవుడు ప్రసన్నులై సమృద్ధిగా వర్షాలు కురిపించాలని మహా ప్రార్థన నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్. లక్ష్మీనరసింహన్ నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేదపండితులు ఈ కార్య‌క్ర‌మం నిర్వహిస్తారు.

వరుణ జపం ద్వారా రాష్ట్రంలోని చెరువులు, నదులు, జలాశయాలు నిండిపోవాలని, ఎండిపోతున్న పంటలు పునరుజ్జీవం పొందాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని, సమాజ శ్రేయస్సు చేకూరాలని ఆలయ అర్చకులు ప్రార్థించనున్నారు. భక్తులు కార్యక్రమంలో పాల్గొని లోకక్షేమం కోసం జరిగే ఈ వైదిక ప్రార్థనలో భాగస్వాములు కావాలని ఆల‌య అధికారులు కోరారు.

Advertisement
Advertisement