Vande Bharat Express | మారిన టైమింగ్స్.. కాచిగూడ, యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆ స్టేషన్‌కు ఎప్పుడు వస్తుందంటే?
Vande Bharat Express | రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) సమయాల్లో స్వల్పంగా మార్పులు చోటుచేసుకున్నాయి.
Vande Bharat Express | త్రినేత్ర.న్యూస్: రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) సమయాల్లో స్వల్పంగా మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం మినహా వారంలో ఆరు రోజులపాటు నడిచే ఈ ఎక్స్‌ప్రెస్ హిందూపూర్ (Hindupur) స్టేషన్‌లో ఆగే సమయాలను మారుస్తూ నైరుతి రైల్వే (South Western Railway) నిర్ణయం తీసుకుంది.
యశ్వంతపూర్ – కాచిగూడ వందే భారత్ (ట్రైన్ నంబర్ 20704) ఎక్స్‌ప్రెస్ సాధారణంగా హిందూపూర్ స్టేషన్‌కు మధ్యాహ్నం 3.48కు వచ్చి 3.50 గంటలకు బయల్దేరుతుంది. అయితే తాజాగా దానిని మధ్యాహ్నం 3.55 గంటలకు చేరుకునేలా, మళ్లీ 3.57 గంటలకు బయలుదేరేలా సమయాన్ని మార్చారు.
ఇక కాచిగూడ – యశ్వంతపూర్ మార్గంలో (ట్రైన్ నంబర్ 20703) హిందూపూర్‌కు ప్రస్తుతం మధ్యాహ్నం 12.08 గంటలకు వచ్చి, 12.10 గంటలకు బయలుదేరేది. దానిని మధ్యాహ్నం 12.17 గంటలకు చేరుకుని, 12.19 గంటలకు బయలుదేరాల మార్పు చేశారు.
రైలు కార్యకలాపాలను మరింత మెరుగుపరచడానికి, సమయపాలన పాటించడానికి ఈమార్పులు చేసినట్లు అధికారులు వెళ్లడించారు. మారిన సమయాలు మార్చి 15 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ కొత్త సమయాలను గమనించి ప్రయాణికులు ప్లాన్ చేసుకోవాలని సూచించారు. కాగా, నిత్యం రద్దీగా ఉంటే బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కాచిగూడ నుంచి బయలు దేరి మహబూబ్‌నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా యశ్వంతపూర్ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.
ఇవికూడా చదవండి..
అల్లు శిరీష్ పెళ్లి ఫొటోలు - హాజరైన అతిథులు వీళ్లే!
చిల్ అవుదామని చిల్డ్ బీర్ కొంటే.. దర్శనమిచ్చిన చేప పిల్ల
యుద్ధం ఎఫెక్ట్!.. భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు..
తాజావార్తలు
- ●Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి
- ●Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి
- ●Indias 2036 Olympic bid | భారత్ ఒలింపిక్ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు
- ●America Visa | విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?
- ●KTR | దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లు.. నువ్ మళ్లీ గెలవడం కలే
- ●Malla Reddy | బీజేపీలోకి మల్లారెడ్డి..? ముహూర్తం ఫిక్స్

Revanth Reddy | ఎమిరేట్స్ విమాన సర్వీసులను మరిన్ని పెంచండి

Vietnam Boat Capsize | వియత్నాంలో ఘోర విషాదం: స్పీడ్‌బోట్ బోల్తా.. ఏపీ, తెలంగాణకు చెందిన పర్యాటకుల మృతి

Indias 2036 Olympic bid | భారత్ ఒలింపిక్ బిడ్‌కు ఆస్ట్రేలియా మద్దతు

America Visa | విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలంటే ఇక కష్టమే.. మరింత కఠినంగా నిబంధనలు..?






