త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

FSSAI | ఆహార ప‌రిశుభ్ర‌త‌లో హైద‌రాబాద్ లాస్ట్‌

FSSAI | హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమ‌సో ఈ దునియా మొత్తం తెలుసు. రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ దేశంలోనే అతిపెద్ద ఫుడ్ ఇండస్ట్రీలలో ఒకటిగా భాగ్య‌న‌గ‌రం వెలుగొందుతోంది. తాజాగా భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) విడుద‌ల చేసిన గ‌ణాంకాల్లో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

S

Hyderabad | Published On Jun 28, 2026, 1.34 pm IST

FSSAI | ఆహార ప‌రిశుభ్ర‌త‌లో హైద‌రాబాద్ లాస్ట్‌
Advertisement
  • గ‌ణాంకాలు వెల్ల‌డించిన భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ

FSSAI | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమ‌సో ఈ దునియా మొత్తం తెలుసు. రుచికరమైన వంటకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటూ దేశంలోనే అతిపెద్ద ఫుడ్ ఇండస్ట్రీలలో ఒకటిగా భాగ్య‌న‌గ‌రం వెలుగొందుతోంది. తాజాగా భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) విడుద‌ల చేసిన గ‌ణాంకాల్లో షాకింగ్ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆహార ప‌రిశుభ్ర‌త రేటింగ్స్‌లో దేశంలోని మెట్రో న‌గ‌రాల‌తో పోలిస్తే హైద‌రాబాద్‌ చిట్ట‌చివ‌ర‌న నిలిచింది. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉండ‌డంతో బిర్యానీలు ఆర‌గించేందుకు ఆలోచించే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

నగరంలో వేల సంఖ్యలో ఉన్న‌ హోటళ్లు, రెస్టారెంట్లు FSSAI ఇచ్చే స్వచ్ఛంద పరిశుభ్రత సర్టిఫికేషన్లను పొందడం లేదు. యాజమాన్యాలు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. నగరంలో అధికారికంగా లైసెన్స్ పొందిన ఆహార విక్రయ కేంద్రాలు (Licensed Eateries) దాదాపు 25,000 వరకు ఉన్నాయి. అయితే వీటిలో కేవలం 361 రెస్టారెంట్లు మాత్రమే ఇప్పటివరకు FSSAI నుండి అధికారికంగా హైజీన్ రేటింగ్స్ తీసుకున్నాయి. ఇది కేవలం 2 శాతం కంటే తక్కువ ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఆహార పరిశుభ్రత గుర్తింపు కార్డులు తీసుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ ముందువ‌రుస‌లో ఉంది. 3,394 రేటెడ్ రెస్టారెంట్లు, బెంగళూరులో 2,200కి పైగా రేటెడ్ రెస్టారెంట్లు ఉండ‌గా హైదరాబాద్‌లో కేవలం 361 రెస్టారెంట్లు మాత్రమే ఉన్నాయి. చివరకు అహ్మదాబాద్, జైపూర్ వంటి చిన్న నగరాలు కూడా ఈ రేటింగ్స్‌లో హైదరాబాద్ కంటే మెరుగైన స్థానంలో ఉండ‌డం విశేషం.

వెనుకబడటానికి కారణం..

FSSAI నిబంధనల ప్రకారం.. ఈ హైజీన్ రేటింగ్ 1 నుండి 5 స్టార్స్ వరకు ఇస్తారు. ఈ రేటింగ్స్‌ తీసుకోవడం అనేది హోటల్ నిర్వాహకులకు కచ్చితమైన నిబంధన కాదు. ఇది పూర్తిగా వారి స్వచ్ఛంద నిర్ణయం. చట్టపరంగా ఎలాంటి బలవంతం లేకపోవడంతో హైదరాబాద్‌లోని హోటల్ యజమానులు ఈ సర్టిఫికేషన్లు పొందడానికి ఆసక్తి చూపించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొంటున్నారు.

కాగా ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లు, కేఫేలు, చివరకు ఆన్‌లైన్ డెలివరీ వేర్‌హౌస్‌లపై కూడా ఫుడ్ సేఫ్టీ టాస్క్‌ఫోర్స్ అధికారులు వరుసగా దాడులు చేయ‌గా అప‌రిశుభ్ర‌త వంట గ‌దులు, కాలం చెల్లిన ఆహార పదార్థాలు వాడటం, పురుగులు పట్టడం వంటి లోపాలు బయటప‌డ్డాయి. కస్టమర్ల ఆరోగ్యం, పరిశుభ్రతకు సమ‌ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

Advertisement
Advertisement