త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat | హిందూపురంలో ఆవుల‌ను ఢీకొట్టిన వందే భార‌త్‌.. త‌ప్పిన ప్ర‌మాదం..

Vande Bharat | ఏపీలోని సత్యసాయి జిల్లాలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. హిందూపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో రెండు ఆవులు పట్టాలపైకి రావడంతో బెంగళూరు వైపు ప్రయాణిస్తున్న వందేభారత్‌ రైలు వాటిని ఢీకొట్టింది.

P

National | Published On Jun 7, 2026, 6.24 pm IST

Vande Bharat | హిందూపురంలో ఆవుల‌ను ఢీకొట్టిన వందే భార‌త్‌.. త‌ప్పిన ప్ర‌మాదం..
Advertisement

Vande Bharat | ఏపీలోని సత్యసాయి జిల్లాలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. హిందూపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో రెండు ఆవులు పట్టాలపైకి రావడంతో బెంగళూరు వైపు ప్రయాణిస్తున్న వందేభారత్‌ రైలు వాటిని ఢీకొట్టింది. కాచిగూడ నుంచి బెంగళూరు దిశగా వేగంగా సాగుతున్న ఈ రైలు హిందూపురం దాటి వెళ్తున్న స‌మ‌యంలో ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే అప్రమత్తమైన లోకోపైలట్‌ అత్యవసరంగా రైలును నిలిపివేశారు. అనూహ్యంగా రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు.

ఏం జరిగిందో అర్థంకాక కోచ్‌ల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే హిందూపురం రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్‌పై ఉన్న పరిస్థితిని పరిశీలించి రైలును నిలిపివేశారు. ఢీకొట్టిన ఆవుల కళేబరాలను పట్టాల నుంచి తొలగించే పనులు చేపట్టారు. అనంతరం ట్రాక్‌ పూర్తిగా పరిశీలించారు. అనంత‌రం అధికారుల నుంచి అనుమ‌తి ల‌భించ‌డంతో దాదాపు అరగంట ఆలస్యంగా వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ తిరిగి బ‌య‌లుదేరింది. ఈ ఘటనలో ప్రయాణికులకు, రైలుకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement
Advertisement