LPG Cylinder | క్యూలైన్‌లో 600 ఖాళీ సిండర్లు.. కోహిర్‌లో గ్యాస్ బండ కోసం కష్టాలు
LPG Cylinder | ఇరాన్, అమెరికా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. హర్మూజ్ జలసంధింని మూసివేడంతో గ్యాస్, ముడి చమురు కొరత ప్రపంచ దేశాలను వేధిస్తున్నది. భారత్ విషయంలో ఇరాన్ కొంత పట్టువిడుపులు లేకుండా ఉండటంతో అడపాడదపా గ్యాస్ (LPG Cylinder), చమురు నౌకలు దేశానికి వస్తున్నాయి.
LPG Cylinder | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, అమెరికా యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. హర్మూజ్ జలసంధింని మూసివేడంతో గ్యాస్, ముడి చమురు కొరత ప్రపంచ దేశాలను వేధిస్తున్నది. భారత్ విషయంలో ఇరాన్ కొంత పట్టువిడుపులు లేకుండా ఉండటంతో అడపాడదపా గ్యాస్ (LPG Cylinder), చమురు నౌకలు దేశానికి వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అన్ని నౌకలు, ఇన్ని నౌకలు వచ్చాయని చెబుతున్నప్పటికీ వంటింట్లో గ్యాస్ మంటలు పుట్టిస్తున్నది. గ్యాస్ కష్టాలు రోజురోజుకు అధికమవుతుండటంతో ప్రజలు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితే సంగారెడ్డి (Sangareddy) జిల్లా కోహిర్‌లో (Kohir) కూడా ఏర్పడింది.
వారం రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సిలిండర్లు వస్తున్నాయన్న సమాచారంతో కోహిర్ పట్టణంలోని గౌడౌన్ వద్దకు ప్రజలు భారీగా చేరుకున్నారు. సుమారు 600 ఖాళీ సిలిండర్లను క్యూలో పెట్టి గ్యాస్ సిలిండర్ కోసం ఎదురుచూస్తున్నారు. గ్యాస్ లభిస్తుందో లేదోనన్న ఆందోళనతో అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లలో ఉన్నారు. కొంతమంది అక్కడే నిద్రపోయారు.

అతికష్టంపై సిలిండర్లు బుక్ అయినప్పటికీ.. అవి వినియోగదారుడి ఇంటికి చేరడానికి రెండు నుంచి మూడు వారాల సమయం పడుతున్నది. డోర్ డెలివరీ ఆలస్యం అవుతుండటంతో వినియోగదారులు ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో 15 లక్షలకుపైగా సిలిండర్ల డెలివరీ పెండింగ్‌లో ఉంది. వీటి సరఫరాకు వారంపైనే పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా 1.30 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో 2.15 లక్షల రోజువారీ బుకింగ్‌లు ఉంటాయి. రోజుకు ఐవోసీఎల్ 93 వేలు, హెచ్‌పీసీఎల్ 75 వేలు, బీపీసీఎల్ 47 వేల చొప్పున గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తుంటాయి. యుద్ధం ప్రారంభం కాకముందు సాధారణ రోజుల్లో రాష్ట్రంలో రోజూ వారీగా 3.50 లక్షల పెండింగ్ బిల్లులు (బుకింగ్) ఉండేవి. అందులో 2.15 లక్షల సిలిండర్లు సరఫరా చేసేవారు. మిగిలినవి మరుసటి రోజున డెలివరీ చేసేవారు. కానీ, ఇప్పుడు పెండింగ్ బుకింగ్‌ల సంఖ్య 15 లక్షలకు పెరిగింది. అంటే ఇవి డెలివరీ కావడానికి 7-8 రోజుల సమయం పడుతుంది. ఆలోపు కొత్త బుకింగ్‌ల సంఖ్య కూడా పెరుగుతూ పోతున్నది. ఒక ఏజెన్సీ 10 రోజుల్లో సిలిండర్ డెలివరీ చేస్తే... 45 రోజులకు 10 రోజులు కలిపి 55 రోజులు అవుతుంది. మరొక ఏజెన్సీ 15 రోజులకు డెలివరీ ఇస్తే 45 రోజులకు 15 రోజులు కలిపి 60 రోజులు పడుతుంది. అంటే రెండు నెలలు సిలిండర్ కోసం ఎదురుచూడాల్సి వస్తున్నది. రాష్ట్రంలో సింగిల్ సిలిండర్ కనెక్షన్లు 38 నుంచి 40 శాతం ఉన్నాయి. ఇలాంటి వారి గ్యాస్ కష్టాలు వర్ణనాతీతం.
సంబంధిత వార్తలు

Girls Missing | సంగారెడ్డి జిల్లాలో నలుగురు బాలికలు అదృశ్యం
జులై 26, 2026

Sangareddy | పదేపదే ఫోన్ చేస్తున్నాడని.. భర్త నంబర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టిన భార్య.. అవమానంతో..
జులై 25, 2026

Chintha Prabhakar | మంజీరా డ్యామ్‌ను అమృత్ ధరోహర్ పథకంలో చేర్చండి.. రామ్సర్ గుర్తింపునకు సహకరించండి
జులై 24, 2026
తాజావార్తలు
- ●Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?
- ●Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
- ●Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!
- ●Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!
- ●Why People Avoid Jewelry | మెడలో, చేతులకు ఎలాంటి ఆభరణాలు ధరించని వారి సైకాలజీ ఎలా ఉంటుందో తెలుసా?
- ●TGPSC OMR Sheets | రోడ్లపై OMR షీట్లు.. TGPSC సంచలన ప్రకటన!

Pavala Shyamala | విషం తాగి చచ్చిపోతే మీకు మనశ్శాంతిగా ఉంటుందా..?

Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత

Horoscope | జూలై 28 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక లాభాలు..!

Morning Phone Habit | పొద్దున్నే లేవగానే మొబైల్ చూస్తున్నారా? ఇది అడిక్షన్ కాదట.. అసలు నిజం తెలిస్తే షాకవుతారు!



