Cyclone Arnab | తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాను.. పలు విమానాలు, రైళ్లు రద్దు
Cyclone Arnab | అర్నబ్ అతి తీవ్ర తుపాను (Cyclone Arnab) భూభాగాన్ని తాకింది. యానాంకి దక్షిణంగా నరసాపురానికి సమీపంతో తుఫాను తీరంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు (Heavy Showers) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు విమానాలు, రైళ్లను అధికారులు రద్దు (Cancelled) చేశారు.
Cyclone Arnab | త్రినేత్ర న్యూస్: అర్నబ్ అతి తీవ్ర తుపాను (Cyclone Arnab) భూభాగాన్ని తాకింది. యానాంకి దక్షిణంగా నరసాపురానికి సమీపంతో తుఫాను తీరంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు (Heavy Showers) కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పలు విమానాలు, రైళ్లను అధికారులు రద్దు (Cancelled) చేశారు.
నిలిచిన విమానాలు..
భోగాపురం ఎయిర్‌పోర్టుకు విమాన రాకపోకలు (Flights) నిలిచిపోయాయి. గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయం నుంచి పలు సర్వీసులను రద్దు చేశారు. విజయవాడ నుంచి రాకపోకలు సాగించే ఆరు విమానాలను రద్దు చేశారు. కడప, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి గన్నవరానికి నడిచే ఐదు ఇండిగో సర్వీసులను రద్దు చేశారు. విశాఖ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సర్వీస్ రద్దయింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన అన్ని సర్వీస్‌లను రద్దు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఫ్లై 91 హైదరాబాద్–విజయవాడ సర్వీసులు, ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ సర్వీసును రద్దు చేసిన ట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి.
రైళ్లు కూడా..
తుఫాను ప్రభావంతో రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేయగా, కొన్నింటిని దారి మళ్లించింది. శ్రీకాకుళం రోడ్-చర్లపల్లి (07038), సికింద్రాబాద్-హౌరా (12704), సికింద్రాబాద్-భువనేశ్వర్ (17016), హైదరాబాద్-విశాఖపట్నం (12728), మహబూబ్‌నగర్-విశాఖపట్నం (12862), లింగంపల్లి-కాకినాడ (12776), లింగంపల్లి-నర్సాపూర్ (17256), లింగంపల్లి-కాకినాడ (12738), నాందేడ్-సంబల్పూర్ (20810), చర్లపల్లి-శ్రీకాకుళంరోడ్ (07037) రైళ్లను రద్దు చేసింది. నాగర్‌సోల్ నుంచి నర్సాపూర్ (12788) రైలును చర్లపల్లి నుంచి నర్సాపూర్‌కు పరిమితం చేశారు.
సంబంధిత వార్తలు

Holiday | అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. నేడు భద్రాద్రి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
అక్టోబర్ 28, 2026

Cyclone Arnab | ఏపీ తీరంవైపుగా ‘అర్నబ్’ తుపాను.. యానాం సమీపంలో తీరం దాటే ఛాన్స్..
అక్టోబర్ 27, 2026

Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
అక్టోబర్ 27, 2026
తాజావార్తలు
- ●Kolkata | బాలికకు ముద్దు పెట్టాడని తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించారు.. నిందితులను కూడా..
- ●Rishabh Singh Sambyal | ఆర్మీని వీడి.. ఫ్యాషన్ రంగంలోకి.. మోడల్‌గా మారిన రాష్ట్రపతి మాజీ ఏడీసీ
- ●Holiday | అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. నేడు భద్రాద్రి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు
- ●ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్
- ●Horoscope | అక్టోబర్ 28 రాశిఫలాలు.. తెలివితేటలతో కోరికలు నెరవేర్చుకుంటారు!
- ●Minister Ponnam | కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి పొన్నం

Kolkata | బాలికకు ముద్దు పెట్టాడని తండ్రీకొడుకులను నగ్నంగా నడిపించారు.. నిందితులను కూడా..

Rishabh Singh Sambyal | ఆర్మీని వీడి.. ఫ్యాషన్ రంగంలోకి.. మోడల్‌గా మారిన రాష్ట్రపతి మాజీ ఏడీసీ

Holiday | అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. నేడు భద్రాద్రి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్



