Deepfakes | అల్గారిథమ్‌ను మార్చండి.. డీప్‌ఫేక్ కంటెంట్‌పై మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు
Deepfakes | సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తి కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డీప్‌ఫేక్ కంటెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటాకు (Meta) కీలక ఆదేశాలు జారీ చేసింది.
Deepfakes | సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ చిత్రాలు, చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తి కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డీప్‌ఫేక్ కంటెంట్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటాకు (Meta) కీలక ఆదేశాలు జారీ చేసింది. తన అల్గారిథమ్‌ను (Algorithm) పునఃపరిశీలించి, కంటెంట్ నియంత్రణకు సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) ఆదేశించింది.
ప్రధాని మోదీ వీడియోను సోషల్ మీడియా నుంచి కొద్దిసేపు తొలగించడంపై మెటా అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తప్పుడు కంటెంట్ కట్టడిపై కూడా మెటా అధికారులతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. చర్చల్లో భాగంగా డీప్‌ఫేక్, మార్ఫింగ్ చిత్రాలు, తప్పుదోవ పట్టించే పోస్ట్‌ల గురించి ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో పోస్ట్ అయ్యే హానికరమైన కంటెంట్‌కు ఆయా యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాలని కేంద్రం స్పష్టం చేసింది.
తప్పుడు కంటెంట్ వేగంగా వ్యాప్తి చెందకుండా అల్గారిథమ్స్‌లో నిర్దిష్ట మార్పులు చేయాలని మెటా అధికారులను కేంద్రం ఆదేశించింది. అంతేకాదు, భవిష్యత్తులో ఇటువంటి కంటెంట్ నియంత్రణకు తీసుకోబోయే చర్యలపై ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను (Compliance Roadmap) సమర్పించాలని ఆదేశించింది. స్పందించిన మెటా అధికారులు.. తమ ప్లాట్‌ఫామ్‌లలో డీప్‌ఫేక్స్‌ను అడ్డుకోవడానికి తగిన సాంకేతిక పరిష్కారాలు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ కంటెంట్ మోడరేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read..
పులుల వాసన పసిగట్టి వాటి 'జాతకం' చెప్పేయొచ్చు.. ఇండియన్ సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ
మహిళ వలపు వల.. పాక్ హ్యాండ్లర్ల చేతికి దేశ రక్షణ రహస్యాలు.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్
ముస్లిం అయినంత మాత్రాన 'పాకిస్థానీ' అంటారా? బీజేపీ ఎమ్మెల్సీకి కర్ణాటక హైకోర్టు అక్షింతలు
సంబంధిత వార్తలు

Meta Platforms | మెటా ప్లాట్‌ఫామ్స్ ఒక పబ్లిక్ న్యూసెన్స్.. న్యూమెక్సికో కోర్టు షాకింగ్ తీర్పు.. సంస్థకు రూ.5400 కోట్ల జరిమానా..
ఆగస్టు 7, 2026

WhatsApp | వాట్సాప్ గ్రూప్ చాట్స్‌లో భారీ మార్పులు.. పోల్స్, ఎట్ ఆల్, కొత్త గ్రూప్ ఫీచర్లు అందుబాటులోకి..
ఆగస్టు 6, 2026

Arvind Kejriwal | నా ఖాతాను ఎందుకు నిలిపివేశారు..? మెటాపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాలకు విజయ్ దేవరకొండ.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు
- ●Varanasi Story | రాజమౌళి వారణాసి కథ లీక్ - రుద్ర, మందాకిని సీక్రెట్ మిషన్ - రామాయణంతో లింక్
- ●Tiger Scent Tracking | పులుల వాసన పసిగట్టి వాటి 'జాతకం' చెప్పేయొచ్చు.. ఇండియన్ సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ
- ●Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..
- ●IND Vs SL Test | శ్రీలంక టెస్టు సిరీస్‌కు సాయి సుదర్శన్ దూరం..
- ●Honey Trap | మహిళ వలపు వల.. పాక్ హ్యాండ్లర్ల చేతికి దేశ రక్షణ రహస్యాలు.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్

Vijay Devarakonda | ఓల్డ్ సిటీ బోనాలకు విజయ్ దేవరకొండ.. 2 వేల మందితో పోలీసు బందోబస్తు

Varanasi Story | రాజమౌళి వారణాసి కథ లీక్ - రుద్ర, మందాకిని సీక్రెట్ మిషన్ - రామాయణంతో లింక్

Tiger Scent Tracking | పులుల వాసన పసిగట్టి వాటి 'జాతకం' చెప్పేయొచ్చు.. ఇండియన్ సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ

Motorola | 10,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 5జి ఫీచర్లతో లాంచ్ అయిన మోటోరోలా కొత్త ట్యాబ్.. ధర ఎంతంటే..



