త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Honey Trap | మ‌హిళ వ‌ల‌పు వ‌ల‌.. పాక్ హ్యాండ్ల‌ర్ల చేతికి దేశ ర‌క్ష‌ణ ర‌హ‌స్యాలు.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌

Honey Trap | పాకిస్థాన్ నిఘా విభాగం (ISI) హనీ ట్రాప్‌లో చిక్కుకుని భారత రక్షణ రంగానికి సంబంధించిన కీలక రహస్యాలను లీక్ చేసిన ఆరోపణలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) వింగ్ కమాండర్‌ను (Indian Air Force Wing Commander) ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు.

D

National | Published On Aug 8, 2026, 4.00 pm IST

Honey Trap | మ‌హిళ వ‌ల‌పు వ‌ల‌.. పాక్ హ్యాండ్ల‌ర్ల చేతికి దేశ ర‌క్ష‌ణ ర‌హ‌స్యాలు.. ఐఏఎఫ్ అధికారి అరెస్ట్‌
Advertisement

Honey Trap | త్రినేత్ర‌.న్యూస్ : పాకిస్థాన్ నిఘా విభాగం (ISI) హనీ ట్రాప్‌లో చిక్కుకుని భారత రక్షణ రంగానికి సంబంధించిన కీలక రహస్యాలను లీక్ చేసిన ఆరోపణలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) వింగ్ కమాండర్‌ను (Indian Air Force Wing Commander) ఢిల్లీ పోలీసులు (Delhi Police) అరెస్ట్ చేశారు. వెస్ట్రన్ ఫ్రంట్‌లోని ఒక ఫీల్డ్ యూనిట్‌లో పనిచేస్తున్న 44 ఏళ్ల వింగ్ కమాండర్‌ను సోషల్ మీడియా ద్వారా ఒక అపరిచిత మహిళ సంప్రదించిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. వ్య‌క్తిగ‌తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఆ మ‌హిళ స‌ద‌రు అధికారికి వ‌ల‌పు వ‌ల (Honey Trap) విసిరింది. క్ర‌మంగా వీరిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇద్ద‌రూ త‌ర‌చూ చాటింగ్ చేసుకుంటూ ద‌గ్గ‌ర‌య్యారు. ఆ మ‌హిళ తన మాటలతో అధికారిని నమ్మించి పూర్తిగా త‌న‌వైపుకు తిప్పుకుంది. త‌ర‌చూ వీడియో కాల్స్‌లో మాట్లాడుకునేవారు. అలా ఓ రోజు భార‌త సైనిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం అడగడం మొద‌లు పెట్టింది. సైనిక కదలికలు, సరిహద్దుల్లో దళాల మోహరింపులకు సంబంధించిన అత్యంత సున్నితమైన వివరాలతో పాటు ఫొటోలు, వీడియోలు పంపాలని ఆ మహిళ ఒత్తిడి తెచ్చింది. దీంతో మహిళపై ఉన్న నమ్మకంతో, సదరు అధికారి భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత గోప్యమైన వ్యూహాత్మక సమాచారాన్ని డిజిట‌ల్ మాధ్య‌మాల ద్వారా ఆమెకు షేర్ చేశాడు.

వాటిని ఆ మ‌హిళ పాక్ హ్యాండ్ల‌ర్ల‌కు (Pak Handler) చేర‌వేసింది. ఆ త‌ర్వాత త‌న ఫోన్‌లో ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని అధికారిని కోరింది. ఆమె చెప్పిన‌ట్లు ఆ అధికారి త‌న ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. ఆ యాప్‌ను తోటి ఉద్యోగుల ఫోన్ల‌లో కూడా ఇన్‌స్టాల్ చేయాల‌ని సూచించింది. అయితే, ఆ యాప్ లొకేషన్‌లను ట్రాక్ చేయడం, సంభాషణలను అడ్డుకోవడం, ఫోన్‌లోని డేటాను దొంగిలించే టార్గెటెడ్ స్పైవేర్ అని విచారణలో తేలింది.

భారత వైమానిక దళానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగానికి స‌ద‌రు అధికారి సోష‌ల్ మీడియా కార్య‌క‌లాపాల‌పై అనుమానం వ‌చ్చి నిఘా పెట్టింది. సైనిక డేటా బయటకు వెళ్తున్నట్లు గుర్తించి వెంటనే ఐఏఎఫ్ అధికారులు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో వారు స‌ద‌రు అధికారిని అరెస్ట్ చేశారు. ఆ అధికారిని మే 30వ తేదీన అదుపులోకి తీసుకోగా, దర్యాప్తు పూర్తి చేసిన పోలీసులు జూలై 30వ తేదీన న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ప్రస్తుతం ఈ అధికారి తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఎంత మేరకు సమాచారం లీక్ అయింది, ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. లీక్‌ అయిన సమాచారం వల్ల దేశ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

Also Read..

ముస్లిం అయినంత మాత్రాన 'పాకిస్థానీ' అంటారా? బీజేపీ ఎమ్మెల్సీకి కర్ణాటక హైకోర్టు అక్షింతలు

ఆ ఇంట్లో ఆమె చనిపోయి ఏడాదైనా..ఆమెను పట్టించుకున్నవారే లేరు

సాగ‌ర్ నిండినా చెరువులు నింప‌లేం..!

Advertisement
Advertisement