త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Meta | సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు

Meta | సోషల్​ మీడియా వేదికల్లో చిన్నారులపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSEAM content) అందుబాటులో ఉంద‌నే ఆరోపణలపై మెటా ఇండియాపై ఢిల్లీ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

D

National | Published On Nov 5, 2026, 11.52 am IST

Meta | సోషల్ మీడియాలో బాలల లైంగిక వేధింపుల కంటెంట్.. మెటాపై ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు
Advertisement

Meta | త్రినేత్ర న్యూస్ : సోషల్​ మీడియా వేదికల్లో చిన్నారులపై లైంగిక దోపిడీ, వేధింపులకు సంబంధించిన కంటెంట్ (CSEAM content) అందుబాటులో ఉంద‌నే ఆరోపణలపై మెటా ఇండియాపై ఢిల్లీ పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. ఈ విష‌యాన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) సభ్యుడు ప్రియాంక్ కానూంగో సోష‌ల్ మీడియా వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించారు. త‌మ‌ ఆదేశాల మేరకే ఢిల్లీ పోలీసులు మెటా ఇండియా (Meta India)పై కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు.

మెటా ఇండియా ఆధ్వర్యంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో బాలల లైంగిక వేధింపులు, దోపిడీకి సంబంధించిన కంటెంట్ ప్రదర్శితమవుతోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన విష‌యం తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్ల (Paid Advertisements) ద్వారా కూడా ఇటువంటి అక్రమ కంటెంట్‌కు దారి తీసే లింకులను ప్రచారం చేశార‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంపై సెప్టెంబ‌ర్ 16న జాతీయ బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ క‌మిష‌న్ (NCPCR) తన విచారణలో భాగంగా మెటా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, హెడ్‌కు స‌మ‌న్లు కూడా జారీ చేసి పూర్తి స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌ట్టింది. అయితే, ఈ అంశాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణ‌మించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC).. ఈ కేసులో పోక్సో యాక్ట్‌, ఐటీ చ‌ట్టాల ఉల్లంఘ‌న జ‌రిగిందా అనే కోణంలో ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఢిల్లీ పోలీసుల‌ను ఆదేశించింది. ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశాల‌తో ఢిల్లీ పోలీసులు మెటా ఇండియాపై కేసు న‌మోదు చేశారు.

Also Read..

ఎన్నిక‌ల్లో ఎక్కువ సీట్లు గెల‌వాలంటే ముందు విదేశీ ప‌ర్య‌ట‌న‌లు ఆపి.. ఈ 7 సూచనలు పాటించండి.. రాహుల్‌కు కేంద్ర మంత్రి చుర‌క‌లు

ట్రంప్‌కు మిడ్‌ట‌ర్మ్ ఝ‌లక్‌.. భార‌త స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ..

మ‌ళ్లీ ఆస్ప‌త్రిలో చేరిన శ‌ర‌ద్ ప‌వార్

Advertisement
Advertisement