MP Raghav Chadha | ఎంపీ రాఘవ్ చద్దా జెడ్ ప్లస్ భద్రత తీసేసిన పంజాబ్.. వెంటనే జెడ్ సెక్యూరిటీ కల్పించిన కేంద్రం
ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా రాఘవ్‌కు కేంద్ర హోం శాఖ వెంటనే భద్రతను పెంచింది. ఢిల్లీ, పంజాబ్ రెండు రాష్ట్రాల్లో ఈ భద్రత వర్తిస్తుంది. పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగే వరకు ఢిల్లీ పోలీసులు రాఘవ్ చద్దాకు సెక్యూరిటీ అందిస్తారు.
MP Raghav Chadha | పంజాబ్ ఆప్ ప్రభుత్వం, ఎంపీ రాఘవ్ చద్దా మధ్య గత కొన్ని రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఏప్రిల్ 2న రాఘవ్ చద్దాను తొలగించడమే కాకుండా రాఘవ్ చద్దాను రాజ్యసభలో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. రాఘవ్ స్థానంలో అశోక్ కుమార్ మిట్టల్‌ను నియమించిన విషయం తెలిసిందే. పార్టీ కోటా నుంచి చద్దాకు మాట్లాడే సమయం కూడా కేటాయించవద్దని రాజ్యసభ సెక్రటేరియట్‌ను ఆప్ కోరింది. ఆ తర్వాత రాఘవ్ కూడా ఆప్ పార్టీపై విరుచుకుపడ్డారు. సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు. పంజాబ్ నిధుల విషయంలో కేంద్రం పట్ల ఆయన మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. తన నోరు కట్టేయడం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని రాఘవ్ కూడా వాళ్ల ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. ఈనేపథ్యంలో రాఘవ్‌కు ఇప్పటి వరకు కేటాయించిన జెడ్ ప్లస్ సెక్యూరిటీని పంజాబ్ ప్రభుత్వం తాజాగా ఉపసంహరించుకుంది.
కొద్ది గంటల్లోనే జెడ్ కేటగిరీ భద్రత
అయితే, బుధవారం నాడు పంజాబ్ ప్రభుత్వం రాఘవ్ చద్దాకు జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని ఉపసంహరించిన కొద్ది గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఆప్ నాయకత్వంతో రాఘవ్‌కు ఉన్న విభేదాల నేపథ్యంలోనే పంజాబ్ ప్రభుత్వం రాఘవ్‌కు ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని తీసేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇంటెలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా రాఘవ్‌కు కేంద్ర హోం శాఖ వెంటనే భద్రతను పెంచింది. ఢిల్లీ, పంజాబ్ రెండు రాష్ట్రాల్లో ఈ భద్రత వర్తిస్తుంది. పారామిలిటరీ దళాలు రంగంలోకి దిగే వరకు ఢిల్లీ పోలీసులు రాఘవ్ చద్దాకు సెక్యూరిటీ అందిస్తారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!
- ●Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్
- ●Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?
- ●Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్
- ●Pooja Hegde | పూజా హెగ్డే టాలీవుడ్ రీఎంట్రీ మూవీపై అప్డేట్ - ఆ ఒక్కటే మిగిలింది!
- ●Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన ప్రముఖులు

Viral News | కవిత సోషల్ మీడియా సెల్లో వేధింపులు..! ఫిర్యాదు చేసిన వారినే ఉద్యోగం నుంచి తొలగించారని ఆరోపణలు!!

Kayadu Lohar | అప్పుడు 30 లక్షలు - ఇప్పుడు మూడు కోట్లు - రెమ్యూనరేషన్ భారీగా పెంచిన కయదు లోహర్

Solar Eclipse | ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా..?

Bonalu | మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో బోనాల వేడుక.. హాజరైన సీఎం రేవంత్






