TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త
TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ గడువులోపు ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో భాస్కర్ గుప్త ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం ప్రకటించారు.
International | Published On Aug 2, 2026, 7.41 pm IST
TCSS | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) (TCSS) అధ్యక్షుడిగా నల్ల భాస్కర్ గుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ గడువులోపు ఒకే టీమ్ నుండి నామినేషన్ రావడంతో భాస్కర్ గుప్త ఎన్నిక ఏకగ్రీవం అయినట్టు ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం ప్రకటించారు. నూతన కార్యవర్గం సహకారంతో సొసైటీని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అధ్యక్షుడు నల్ల భాస్కర్ తెలిపారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తున్నకార్యనిర్వాహక వర్గ సభ్యులందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) పదమూడో వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 2న స్థానిక కుర్తాళం బోర్డర్, లిటిల్ ఇండియాలో నిర్వహించారు. ఈ సమావేశంలో సుమారు 65-70 మంది సభ్యులు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా 12వ సర్వసభ్య సమావేశపు వివరాలతో పాటు 2025-2026 ఆర్థిక సంవత్సరపు రాబడి, ఖర్చుల పట్టికను సభ్యులకు వివరించారు. ఈ సమావేశం సందర్భంగా సమ్మయ్య మోలుగూరి, ఇతర సభ్యులు అడిగిన వివిధ ప్రశ్నలకు సొసైటీ పూర్వ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల, కోశాధికారి నంగునూరి వెంకట రమణ సమాధానాలు ఇచ్చారు. ఈ సమావేశానికి మోడరేటర్‌గా ప్రధాన కార్యదర్శి రాము బొందుగులవ్యవహరించారు. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సేవలందించిన కిరణ్ కుమార్ ఎర్రబోయిన మరియు నీలం సుఖేందర్ గార్లకు కృతజ్ణతలు తెలియజేశారు.
ఈ సమావేశంలోనే నల్ల భాస్కర్ గుప్త, ఇతర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనే విషయాన్ని ఎన్నికల అధికారులు తెల్లదేవరపల్లి కిషన్ రావు, మల్లారెడ్డి కళ్లెం ప్రకటించారు. టీసీఎస్ఎస్ సభ్యులు ఇచ్చిన సలహాలన్నింటిని స్వీకరించి అమలు చేయుటకు శాయశక్తులా ప్రయత్నిస్తామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన కిషన్ రావు, మల్లారెడ్డికి సొసైటీ సభ్యులు కృతజ్ణతలు తెలియజేశారు. దీంతో పాటు 2026-2027 ఆర్థిక సంవత్సరానికి ఆడిటర్లుగా సురేష్ మాటేటి, శ్రీధర్ బండారులను ఎన్నుకున్నారు. అంతేకాదు తన పదవీకాలంలో సొసైటీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన రమేష్ బాబు గడప సేవలను ఏవి (AV) రూపంలో ప్రదర్శించి ఆయనను మర్యాదపూర్వకంగా సన్మానించారు.

గత పన్నెండు సంవత్సరాలుగా రమేష్ బాబు అందించిన సేవలను పూర్వ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, నీలం మహేందర్ కొనియాడారు. గత పదమూడు సంవత్సరాలుగా సొసైటీలో భాగమై రెండు సార్లు అధ్యక్షుడిగా సేవచేసే అవకాశం ఇచ్చినందుకు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రమేష్ బాబు భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సొసైటీ వెన్నంటే ఉంటూ సేవలందించిన దుర్గా ప్రసాద్, సుగుణాకర్ రెడ్డిలకు కార్యనిర్వాహక సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సొసైటీ వెన్నంటే ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి, సమావేశం సజావుగా సాగడానికి సహకరించిన సభ్యులందరికి కార్యనిర్వాహక సభ్యులందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. చివరిగా సర్వ సభ్యులందరూ సొసైటీ ఏర్పాటు చేసిన హై టీని ఆస్వాదించారు.
నూతన కార్యవర్గం, కార్యనిర్వాహక వర్గం :
అధ్యక్షుడు నల్ల భాస్కర్, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు మరియు శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్, యసరావేణి విజయ కుమార్.
సంబంధిత వార్తలు

Harish Rao | యువతకు అన్యాయం జరుగుతున్నప్పుడు.. టిక్కీ లాంటి సంస్థలు ప్రెజరర్ గ్రూప్‌గా కూడా పని చేయాలి
ఆగస్టు 12, 2026

Chamala Kiran Kumar Reddy | కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయ్: ఎంపీ చామల
ఆగస్టు 12, 2026

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
ఆగస్టు 12, 2026
తాజావార్తలు
- ●HCU | హెచ్‌సీయూలో డ్రగ్స్ కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్
- ●Harish Rao | యువతకు అన్యాయం జరుగుతున్నప్పుడు.. టిక్కీ లాంటి సంస్థలు ప్రెజరర్ గ్రూప్‌గా కూడా పని చేయాలి
- ●PM Modi | ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల మాయలో పడొద్దు.. యువతకు మోదీ కీలక సందేశం
- ●Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం!
- ●VC Sajjanar | ప్యాకేజింగ్‌కు.. ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై నిషేధం: సీపీ సజ్జనర్
- ●Chamala Kiran Kumar Reddy | కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయ్: ఎంపీ చామల

HCU | హెచ్‌సీయూలో డ్రగ్స్ కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్

Harish Rao | యువతకు అన్యాయం జరుగుతున్నప్పుడు.. టిక్కీ లాంటి సంస్థలు ప్రెజరర్ గ్రూప్‌గా కూడా పని చేయాలి

PM Modi | ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల మాయలో పడొద్దు.. యువతకు మోదీ కీలక సందేశం

Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం!



