BRS Leaders | కాంగ్రెసోళ్లది మిడిమిడి జ్ఞానం.. నీళ్లపై అవగాహనే లేదు..
BRS Leaders | రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ నీళ్లపై అవగాహన లేదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులు నింపకుండా.. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Leaders | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, మంత్రులకు కానీ నీళ్లపై అవగాహన లేదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. సాగునీటి ప్రాజెక్టులు నింపకుండా.. రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గాయత్రి పంపు హౌజ్‌ను మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ కలిసి సందర్శించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
నీళ్లపై అవగాహన ఉన్నవారితో మాట్లాడవచ్చు.. ఏమీ తెలియని వారికి వివరించవచ్చు.. కానీ, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే కాంగ్రెసోళ్లతో మాట్లాడలేం. ఏ బేసిన్‌లో ఏ ప్రాజెక్టు ఉందో.. ఏ ప్రాజెక్టు నుంచి నీళ్లను ఎక్కడికి తరలిస్తారో కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు తెలియదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని కొన్నిసార్లు చెప్పినా వీళ్లకు అర్థం కాదు. కాంగ్రెస్ నేతలందరికీ ప్రాజెక్టులపై, నీళ్లపై పక్కాగా అవగాహన తరగతులు పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.
- మాజీ ఎంపీ వినోద్ కుమార్
కాంగ్రెస్ ముఖ్యమంత్రికి, మంత్రులకు నీళ్లపై కనీస అవగాహన లేదు. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు గ్రావిటీ ద్వారా నీళ్లొస్తున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సోయి లేకుండా మాట్లాడటం హాస్యాస్పదం. కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగమైన నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారానే ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీళ్లు తరలిస్తారనే నిజం.. ఈ తెలివిలేని అడ్లూరికి తెలియజెప్పడానికే ఈ యాత్ర చేపట్టాం.
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
గోదావరి ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు సోయి లేకుండా మాట్లాడుతున్నారు. ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు గ్రావిటీతోనే నీళ్లొస్తాయంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. సముద్ర మట్టానికి ఎగువన ఉన్న ప్రాంతాలకు నీళ్లందించడానికే 'బాహుబలి మోటార్లు' పెట్టారనే కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదు. కేసీఆర్ గారిపై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టకుండా... పూర్తిస్థాయిలో పంపులను ఆన్ చేసి, ప్రాజెక్టులన్నీ తక్షణమే నింపాలని డిమాండ్ చేస్తున్నాం.
- మాజీ మంత్రి గంగుల కమలాకర్
నీళ్లపై, ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల తెలివితక్కువ మాటలు విని ప్రజలంతా నవ్వుకుంటున్నారు. మంత్రులకు ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీళ్లు ఎట్లొస్తాయో తెల్వదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మేడారానికి, మేడిగడ్డకు తేడా తెల్వదు. ఎల్లంపల్లిని పూర్తి చేసి, లక్షలాది ఎకరాలకు సాగు నీరందించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అనే సోయి కూడా లేదు.
- మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా ఎల్లంపల్లి నుండి మిడ్ మానేరుకు నీళ్లు తరలిస్తారనే కనీస సోయి కూడా ఈ కాంగ్రెస్ నాయకులకు లేదు. ఈ కరువు పరిస్థితులలో పూర్తిస్థాయిలో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి గోదావరి జలాలను ఉపయోగించుకునే వరకు కేసీఆర్ నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న కుట్రలన్నింటినీ తిప్పికొడతాం.
- ఎమ్మెల్సీ ఎల్. రమణ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Coal Mines | తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్: సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించండి
ఆగస్టు 11, 2026

Pocharam Srinivas Reddy | అసలు… నా ఫోనే ఎత్తుతలేరు : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఆగస్టు 11, 2026

CM Revanth Reddy | ఓల్డ్ సిటీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
ఆగస్టు 11, 2026
తాజావార్తలు
- ●HCU | హెచ్‌సీయూలో డ్రగ్స్ కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్
- ●Harish Rao | యువతకు అన్యాయం జరుగుతున్నప్పుడు.. టిక్కీ లాంటి సంస్థలు ప్రెజరర్ గ్రూప్‌గా కూడా పని చేయాలి
- ●PM Modi | ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల మాయలో పడొద్దు.. యువతకు మోదీ కీలక సందేశం
- ●Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం!
- ●VC Sajjanar | ప్యాకేజింగ్‌కు.. ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫోయిల్ వాడకంపై నిషేధం: సీపీ సజ్జనర్
- ●Chamala Kiran Kumar Reddy | కేటీఆర్.. ఇప్పటికైనా పిచ్చి మాటలు బంద్ చేయ్: ఎంపీ చామల

HCU | హెచ్‌సీయూలో డ్రగ్స్ కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్

Harish Rao | యువతకు అన్యాయం జరుగుతున్నప్పుడు.. టిక్కీ లాంటి సంస్థలు ప్రెజరర్ గ్రూప్‌గా కూడా పని చేయాలి

PM Modi | ఇన్‌ఫ్ల్యూయెన్సర్ల మాయలో పడొద్దు.. యువతకు మోదీ కీలక సందేశం

Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం!



