Xi Jinping | బీ-1 బాంబర్లు, 100 అడుగుల రెడ్ కార్పెట్.. అమెరికాలో జిన్‌పింగ్‌కు గ్రాండ్ వెల్‌కమ్
Xi Jinping | దాదాపు 11 ఏళ్ల తర్వాత అమెరికా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు (Chinese President) షీ జిన్‌పింగ్ (Xi Jinping)కు ఘన స్వాగతం లభించింది. ట్రంప్ దంపతులు స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి జిన్‌పింగ్ దంపతులకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.
International | Published On Sep 24, 2026, 10.43 am IST
Xi Jinping | త్రినేత్ర న్యూస్ : అమెరికా పర్యటనకు వెళ్లిన చైనా అధ్యక్షుడు (Chinese President) షీ జిన్‌పింగ్ (Xi Jinping)కు ఘన స్వాగతం లభించింది. వాషింగ్టన్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ (Joint Base Andrews)లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన సతీమణి, ఫస్ట్‌లేడీ మెలానియాతో కలిసి స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి జిన్‌పింగ్ దంపతులకు స్వాగతం పలికారు.
సాధారణంగా అమెరికా అధ్యక్షులు విదేశీ నేతలకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి స్వాగతం పలకడం చాలా అరుదు. వైట్‌హౌస్‌లోనే స్వాగతం పలుకుతుంటారు. అయితే, ఈ సారి స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి జిన్‌పింగ్ దంపతులను అధ్యక్షుడు ఆహ్వానించడం విశేషం. విమానం దిగి వస్తున్న జిన్‌పింగ్ దంపతులకు ట్రంప్ దంపతులు ఎదురెళ్లి మరీ సాదర స్వాగతం పలికారు.
దాదాపు 100 అడుగుల పొడవైన రెడ్ కార్పెట్ (100 foot red carpet)తో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. సైనిక గౌరవ వందనం, మిలిటరీ బ్యాండ్ ప్రదర్శనతో పాటు రెండు బీ-1 బాంబర్ విమానాలు గగనతలంలో చక్కర్లు కొట్టాయి (B1 bomber flyover). ఇక జిన్‌పింగ్ అమెరికా పర్యటనకు ముందు కీలక ఒప్పందం కుదిరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య కుదిరిన వాణిజ్య సంధిని మరో రెండు నెలలు పొడిగిస్తూ ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.

దాదాపు 11 ఏళ్ల తర్వాత షీ జిన్‌పింగ్ అమెరికాలో అధికారికంగా పర్యటించడం ఇదే మొదటిసారి. దీంతో ఆయన పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తినెలకొంది. జిన్‌పింగ్ మూడు రోజుల పాటూ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌తోపాటూ పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా వాణిజ్యం (Trade), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇరాన్ అంశాలతో పాటు అమెరికా-చైనా ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేసే పలు కీలక విషయాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. అనంతరం వైట్‌హౌస్‌లో అధికారిక విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ డిన్నర్‌కు ఎలాన్ మస్క్, సుందర్ పిచాయ్, జెఫ్ బెజోస్, సామ్ ఆల్టమన్ సహా తదితర టెక్ దిగ్గజాలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
NOW: President Trump has greeted Chinese President Xi Jinping in Washington, DC with the following:
- 100-foot-long red carpet
- Salute Battery
- 21-Person Honor Cordon
- 2 three-person color teams to include the U.S. and Chinese flag
- USAF band playing fanfare and… pic.twitter.com/X7W0oOtc2u— Jordan Conradson🇺🇸 (@ConradsonJordan) September 23, 2026
Also Read..
జ్ఞానేశ్ ఇట్స్ డన్ బ్రో.. అభిజీత్ దిప్కే ఆసక్తికర పోస్ట్
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై టూరిస్టు బస్సు దగ్దం.. 9 మంది సజీవ దహనం
మార్కెట్లు డౌన్.. 23,300 దిగువకు నిఫ్టీ.. 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్..
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Iran America War | బాలకృష్ణ వీడియోతో ట్రంప్‌ను ఎద్దేవా చేసిన ఇరాన్
సెప్టెంబర్ 24, 2026

Crude Oil | రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు కోత..? అమెరికా ఆంక్షలతో భారత్‌పై ఒత్తిడి..
సెప్టెంబర్ 22, 2026

Russia Sanctions Bill | రష్యా ఆంక్షల బిల్లుపై ట్రంప్ సంతకం.. ఇక భారత్‌పై 100% టారిఫ్స్..!
సెప్టెంబర్ 19, 2026
తాజావార్తలు
- ●IRDAI | బీమా పాలసీలపై కీలక మార్పులు.. కమిషన్లకు ఐఆర్డీఏఐ కత్తెర..
- ●Stock Markets | మార్కెట్లు డౌన్.. 23,300 దిగువకు నిఫ్టీ.. 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్..
- ●Abhijeet Dipke | జ్ఞానేశ్ ఇట్స్ డన్ బ్రో.. అభిజీత్ దిప్కే ఆసక్తికర పోస్ట్
- ●Metro Pillar | మట్టే కనిపించిందా.. మెట్రో పిల్లర్లు కనిపించలేదా?.. ఇస్కాన్ సమీపంలో తవ్వకాలపై ఎన్హెచ్ఆర్సీకి న్యాయవాది రామారావు ఫిర్యాదు
- ●Ganesh immersion | గణేశ్ నిమజ్జన విధులకు వచ్చి.. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
- ●Tourist Bus | యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై టూరిస్టు బస్సు దగ్దం.. 9 మంది సజీవ దహనం

IRDAI | బీమా పాలసీలపై కీలక మార్పులు.. కమిషన్లకు ఐఆర్డీఏఐ కత్తెర..

Stock Markets | మార్కెట్లు డౌన్.. 23,300 దిగువకు నిఫ్టీ.. 100 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్..

Abhijeet Dipke | జ్ఞానేశ్ ఇట్స్ డన్ బ్రో.. అభిజీత్ దిప్కే ఆసక్తికర పోస్ట్

Metro Pillar | మట్టే కనిపించిందా.. మెట్రో పిల్లర్లు కనిపించలేదా?.. ఇస్కాన్ సమీపంలో తవ్వకాలపై ఎన్హెచ్ఆర్సీకి న్యాయవాది రామారావు ఫిర్యాదు



