త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ATM Charges | 3 రోజులు బ్యాంకుల‌ సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..

ATM Charges | సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంకు సమ్మె జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాదారులకు కాస్త ఊరట లభించింది. ఈ మూడు రోజుల్లో సాధారణంగా నెలకు ఉచితంగా అనుమతించే నగదు ఉపసంహరణ పరిమితిని మించి ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్నా అదనపు చార్జీలు వసూలు చేయకూడదని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి.

S

Business | Published On Sep 26, 2026, 3.02 pm IST

ATM Charges | 3 రోజులు బ్యాంకుల‌ సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..
Advertisement

ATM Charges | సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు బ్యాంకు సమ్మె జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాదారులకు కాస్త ఊరట లభించింది. ఈ మూడు రోజుల్లో సాధారణంగా నెలకు ఉచితంగా అనుమతించే నగదు ఉపసంహరణ పరిమితిని మించి ఏటీఎంల నుంచి డబ్బు తీసుకున్నా అదనపు చార్జీలు వసూలు చేయకూడదని పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ సదుపాయాన్ని ప్రకటించాయి. శాఖల్లో సేవలకు అంతరాయం ఏర్పడే సమయంలో ఖాతాదారులు నగదు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆ 3 రోజులు ఏటీఎం చార్జీలు లేవు..

ఈ మినహాయింపు కారణంగా ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంలతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలను కూడా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా నెలకు ఉచితంగా అనుమతించే నగదు ఉపసంహరణ పరిమితిని దాటితే విధించే అదనపు చార్జీలు సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు వర్తించవు. బ్యాంకు సమ్మె కారణంగా శాఖల సేవలు నిలిచిపోయే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ తాత్కాలిక మినహాయింపును అందిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చేసిన ప్రకటనలో సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎంలో చేసిన లావాదేవీలకైనా అదనపు ట్రాన్సాక్షన్ చార్జీలు వర్తించవని తెలిపింది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో ఖాతాదారులు తమ సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి నెలకు ఐదు ఉచిత నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి మూడు ఉచిత లావాదేవీలకు అవకాశం ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో సొంత బ్యాంకు ఏటీఎంలతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి కలిపి వర్తించే ఉచిత లావాదేవీల పరిమితి ఐదు వరకు ఉంటుంది. ఈ పరిమితిని దాటితే సాధారణంగా చార్జీలు విధిస్తారు. అయితే బ్యాంకు సమ్మె నేపథ్యంలో ఈ పరిమితిని తాత్కాలికంగా నిలిపివేశారు.

స‌మ్మె ప్ర‌భావం అధికంగానే..

యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల సమ్మెకు సిద్ధమవుతున్నారు. బ్యాంకింగ్ సిబ్బందిలో సుమారు 90 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సమాఖ్య, ఐదు రోజుల బ్యాంకింగ్ వారాన్ని అమలు చేయాలనే దీర్ఘకాలిక డిమాండ్‌తోపాటు ఇతర అంశాలపై సమ్మెకు పిలుపునిచ్చింది. ఇదే సమయంలో బ్యాంకింగ్ రంగంలో అర్ధ సంవత్సర ఖాతాల ముగింపు ప్రక్రియ కూడా ఉండడంతో సమ్మె ప్రభావం మరింత ఉండే అవకాశం ఉంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె కారణంగా ఖాతాదారులకు కలిగే ఇబ్బందులను తగ్గించేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 27న‌ ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని ఆదేశించింది. దీంతో సమ్మెకు ముందు ఖాతాదారులకు అవసరమైన బ్యాంకింగ్ పనులను పూర్తి చేసుకునేందుకు అదనపు పని దినం లభించనుంది.

య‌థావిధిగానే ప‌నిచేయ‌నున్న ప్రైవేటు బ్యాంకులు..

పలు బ్యాంకులు కూడా ఖాతాదారులు అత్యవసరమైన బ్యాంకింగ్ పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సాధ్యమైనంత వరకు ఏటీఎంలు, యోనో, ఇతర డిజిటల్ బ్యాంకింగ్ మార్గాలను ఉపయోగించుకోవాలని ఖాతాదారులను కోరింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా సమ్మె సమయంలో తమ 24 గంటల డిజిటల్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించింది. పాత తరం ప్రైవేట్ బ్యాంక్ అయిన కర్ణాటక బ్యాంక్ కూడా సమ్మె ప్రభావంతో శాఖల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంద‌ని తెలిపింది. అయితే అంతరాయం ఏ స్థాయిలో ఉంటుందో ప్రస్తుతం అంచనా వేయలేమని పేర్కొంది. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటి కొత్త తరం ప్రైవేట్ బ్యాంకులు సాధారణంగానే పనిచేసే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన డిమాండ్లలో చాలా వరకు ఇప్పటికే గణనీయంగా పరిష్కరించామని పేర్కొంటూ సమ్మెను విరమించుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యూనియన్లను కోరింది.

Advertisement
Advertisement