POCSO Case | 11 ఏండ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు.. యువకుడికి ఐదేండ్ల జైలుశిక్ష
POCSO Case | మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి పోక్సో కోర్టు (POCSO court) ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.9 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
POCSO Case | త్రినేత్ర.న్యూస్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి పోక్సో కోర్టు (POCSO court) ఐదేండ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.9 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని ముషీరాబాద్ (Musheerabad) పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌నగర్‌కు చెందిన వీ.మణికంఠ (27) పొరుగున ఉండే 11 ఏండ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. బాలిక పట్ల అనుచితంగా మాట్లాడటం, జుట్టు లాగడం, చేతులు, కాళ్లు పట్టుకుని వేధించడం, దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బుగ్గలు తాకడం వంటి చర్యలకు పాల్పడేవాడు. దీంతో బాధితురాలి తల్లి 2023, జూన్ 4న ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సోతోపాటు (POCSO Case) వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. తాజాగా ఈ కేసులో నిందితుడికి నాంపల్లిలోని 12వ అదనపు సెషన్స్ కోర్టు (పోక్సో కేసుల విభాగం) 5 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, రూ. 9,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈమేరకు హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) వెల్లడించారు. నిందుడికి శిక్షపడేలా చేసిన పోలీసు అధికారులు, భరోసా టీమ్, లీగల్ టీమ్‌ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అభినందించారు.
సంబంధిత వార్తలు

POCSO Case | లెక్కలు చెబుతానంటే మైనర్ బాలికపై అఘాయిత్యం.. టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జ్పై పోక్సో కేసు
ఆగస్టు 9, 2026

POCSO Judgment | 12 ఏండ్ల బాలికపై అఘాయిత్యం చేశాడు.. 10 ఏండ్ల జైలు శిక్ష వేశారు
ఆగస్టు 7, 2026

Hyderabad | ఇన్‌స్టాలో మైనర్ బాలికలే టార్గెట్.. ప్రేమ పేరుతో ఐదుగురు యువతులతో వ్యవహారం..
జులై 26, 2026
తాజావార్తలు
- ●BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం
- ●PB Fintech | ఐఆర్డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..
- ●Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూములపై తేల్చండి.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- ●PM Modi | సేవే ప్రధాన లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ
- ●Danam Nagender | దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- ●NSE IPO | ఎన్ఎస్ఈ షేర్లకు అదిరిపోయే ర్యాలీ.. 5 శాతం జంప్.. ప్రాఫిట్ బుక్ చేయాలా..?

BRS Protest at Yadadri Power Station | యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద బీఆర్ఎస్ ధర్నా... పోలీసులకు, నేతల మధ్య వాగ్వాదం

PB Fintech | ఐఆర్డీఏఐ చర్యల ఎఫెక్ట్.. పాలసీబజార్‌కు భారీ షాక్.. 28 శాతం పతనమైన షేర్..

Enquiry Committee on Lands | కేసీఆర్, కేటీఆర్, హరీశ్ భూములపై తేల్చండి.. ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

PM Modi | సేవే ప్రధాన లక్ష్యం కావాలి : ప్రధాని మోదీ



