త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bank Employees Strike | వినియోగ‌దారుల‌కు బిగ్ రిలీఫ్‌.. బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా

Bank Employees Strike | బ్యాంకు వినియోగ‌దారులకు భారీ ఊర‌ట ల‌భించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె (Bank Employees Strike) వాయిదా పడింది. ఈ మేరకు వాయిదా (Postponed) వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది.

G

National | Published On Sep 28, 2026, 6.12 am IST

Bank Employees Strike | వినియోగ‌దారుల‌కు బిగ్ రిలీఫ్‌.. బ్యాంకు ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా
Advertisement

Bank Employees Strike | త్రినేత్ర న్యూస్‌: బ్యాంకు వినియోగ‌దారులకు భారీ ఊర‌ట ల‌భించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు నిర్వహించాల్సిన మూడు రోజుల బ్యాంకు ఉద్యోగుల సమ్మె (Bank Employees Strike) వాయిదా పడింది. ఈ మేరకు వాయిదా (Postponed) వేస్తున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ప్రకటించింది. ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యూఎఫ్‌బీయూ ప్రతినిధుల మధ్య జ‌రిగిన చ‌ర్చ‌లు స‌ఫ‌ల‌మ‌వ‌డంతో సోమ‌వారం నుంచి నిర్వ‌హించ త‌ల‌పెట్టిన సమ్మె, ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేస్టున్న‌ట్లు యూఎఫ్‌బీయూ తెలిపింది. దీంతో బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి. జరగాల్సిన సమ్మెను వాయిదా వేసిన నేపథ్యంలో తదుపరి చర్చలు, నిర్ణయాలపై బ్యాంక్ ఉద్యోగ సంఘాల్లో ఆసక్తి నెలకొంది.

ఉద్యోగుల ప్ర‌ధాన డిమాండ్ల‌లోఒక‌టైన వారానికి 5 రోజుల ప‌నిదినాల అంశంపై చ‌ర్చించేందుకు IBA, UFBU ప్ర‌తినిధుల‌తో కూడిన ఉన్నత స్థాయి కమిటీని వెంటనే ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ సాధ్యమైన అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలించడంతో పాటు సంబంధిత వర్గాలు, బ్యాంకు ఉద్యోగులు, ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని స‌రైన నిర్ణ‌యం తీసుకోనుంది. దీనితో పాటు స్కేల్-4, ఆపై స్థాయి అధికారుల పనితీరు ఆధారిత ఇన్సెంటివ్ (PLI) పథకంలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి ఐబీఏ అంగీకరించింది. మిగిలిన పెండింగ్ సమస్యలపై కూడా త్వరలోనే సామరస్యపూర్వకంగా చర్చించి తగిన పరిష్కారం కనుగొంటామని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement