Case Against Kashmir MP | సోషల్‌మీడియాలో తప్పుదోవ పట్టించే కంటెంట్.. శ్రీనగర్ ఎంపీపై కేసు నమోదు
Case Against Kashmir MP | శ్రీనగర్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ (Aga Syed Ruhullah Mehdi)పై కేసు నమోదైంది (Case Against Kashmir MP).
Case Against Kashmir MP | శ్రీనగర్ ఎంపీ ఆగా సయ్యద్ రుహుల్లా మెహదీ (Aga Syed Ruhullah Mehdi)పై కేసు నమోదైంది (Case Against Kashmir MP). సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను షేర్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడుల్లో (US-Israel attack) ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) చనిపోయిన విషయం తెలిసిందే.
ఖమేనీ మృతిని ఖండిస్తూ శ్రీనగర్‌లో షియా ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలను ఎంపీ సోషల్ మీడియాలో షేర్ చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు తాజాగా చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను షేర్ చేసినందుకు గానూ.. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 197(1)(డీ), 353(1)(బీ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇక పోలీసుల చర్యపై మెహదీ కార్యాలయం ఘాటుగా స్పందించింది. "ఒక సార్వభౌమ దేశ నాయకుడి వీరమరణాన్ని ఖండించే ధైర్యం లేని యంత్రాంగానికి.. ఆ పని చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసే ధైర్యం మాత్రం వచ్చింది" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ పరిణామాలపై ఎంపీ మెహదీ సైతం స్పందించారు. శ్రీనగర్ ప్రజలు తమ ఎంపీని ఎన్నుకున్నది ప్రభుత్వం ఆమోదించిన సంతాప సందేశాలను చదివేందుకు కాదని వ్యాఖ్యానించారు. నిజం మాట్లాడేందుకు అని పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో ఎంపీతోపాటూ శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ అజిమ్ మట్టుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read..
హోలీ వేళ ఎల్‌వోసీ వద్ద కలకలం.. చొరబాటు యత్నాన్ని అడ్డుకున్న సైన్యం
యష్ ‘టాక్సిక్’కు వార్ సెగ.. సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్
ట్రంప్ మెడపై ఎర్రటి మచ్చలు.. అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలు
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?
- ●Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
- ●Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..
- ●Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ
- ●Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..

Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ






