Gold And Silver Prices Today | అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు.. బంగారం, వెండి ధరలపై ప్రభావం..
Gold And Silver Prices Today | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. పెట్టుబడిదారులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గాయి.
Gold And Silver Prices Today | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. పెట్టుబడిదారులు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన ప్రతికూల సంకేతాల కారణంగా బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య యుద్ధం ముగిసినప్పటికీ ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండడం ఆందోళన పెంచుతోంది. దీంతో సేఫ్ హావెన్ ఆస్తుల పట్ల పెట్టుబడిదారులు మొగ్గు చూపడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.99 శాతం మేర తగ్గి 4,123 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి ధర 2.29 శాతం మేర పతనమై 60 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1314 పాయింట్లు తగ్గి 1,45,603 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,513 పాయింట్లు పతనమై 2,31,464 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గగా, వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,526 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,16, 208గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,45,260 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.14,52,600 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.13,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.13,315 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,06,520గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,33,150 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.13,31,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.12,500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.10,894 ఉండగా, 8 గ్రాముల ధర రూ.87,152గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,08,940 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.10,89,400గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10,300 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,45,000 ఉండగా, తులం ధర రూ.2,450గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో అనిశ్చితి..
జులై 6, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..
జులై 4, 2026

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో పెట్టుబడిదారుల జోరు.. ఒక్క రోజులోనే రూ.32వేలు పెరిగిన పసిడి ధర..
జులై 3, 2026
తాజావార్తలు
- ●Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ
- ●Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..
- ●Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం
- ●Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం
- ●Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..
- ●Portugal Vs Spain | చెదిరిన రొనాల్డో ప్రపంచకప్ కల

Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ - అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ

Stock Markets | క్రమంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం..

Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం

Woman fight with Jackal | నక్క బెదిరింపులకు వణకని 60 ఏళ్ల వృద్ధురాలు.. అరగంట పాటు వీరోచిత పోరాటం



