త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | క్ర‌మంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబ‌డిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్ల‌లో ఉత్సాహం..

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు ధరలు యుద్ధానికి ముందు స్థాయికి చేరుకోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపడం మార్కెట్లకు బలాన్నిచ్చాయి.

S

Business | Published On Jul 7, 2026, 10.32 am IST

Stock Markets | క్ర‌మంగా పెరుగుతున్న విదేశీ పెట్టుబ‌డిదారుల కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్ల‌లో ఉత్సాహం..
Advertisement

Stock Markets | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్‌లో లాభాలతో ప్రారంభమయ్యాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు ధరలు యుద్ధానికి ముందు స్థాయికి చేరుకోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపడం మార్కెట్లకు బలాన్నిచ్చాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్ 176 పాయింట్లు పెరిగి 78,461.16 వద్ద ట్రేడ్ అయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 34.1 పాయింట్లు లాభపడి 24,464.45 వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌లో టైటాన్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. మరోవైపు ట్రెంట్ షేరు దాదాపు 9.8 శాతం మేర భారీగా పతనమైంది. లార్సెన్ అండ్ టూబ్రో, భారత్ ఎలక్ట్రానిక్స్, ఐటీసీ, టాటా స్టీల్ షేర్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.

పెరిగిన ఎఫ్ఐఐల కొనుగోళ్లు..

ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారం సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.243.03 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పీ సూచీ 7 శాతం వరకు క్షీణించింది. జపాన్ నిక్కీ 225, చైనా షాంఘై ఎస్‌ఎస్‌ఈ కాంపోజిట్, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ సూచీలు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఇక అమెరికా మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో చ‌మురు ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధ‌ర 1.28 శాతం పెరిగి బ్యారెల్‌కు 72 డాల‌ర్ల‌కు చేర‌గా, డ‌బ్ల్యూటీఐ క్రూడ్ ధ‌ర 1.13 శాతం పెరిగి బ్యారెల్‌కు 68 డాల‌ర్ల‌కు చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి కాస్త కోలుకుంది. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే 11 పైసలు బ‌ల‌ప‌డ్డ రూపాయి 95.27 వ‌ద్ద ఉంది.

బ‌ల‌మైన అప్ ట్రెండ్ సంకేతాలు..

జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ మార్కెట్‌లో స్పష్టమైన అప్‌ట్రెండ్ సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపారు. భారత మార్కెట్లపై ఒత్తిడి తెచ్చిన రెండు ప్రధాన అంశాలైన ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల నిరంతర విక్రయాలు ఇప్పుడు తగ్గిపోయాయని చెప్పారు. క్రూడ్ ధరలు మళ్లీ యుద్ధానికి ముందు స్థాయికి రావడం, ఎఫ్‌పీఐలు విక్రేతల నుంచి కొనుగోలుదారులుగా మారడం సానుకూల పరిణామమని పేర్కొన్నారు. ఎఫ్‌పీఐల కొనుగోళ్లు ఇంకా బలమైన ధోరణిగా మారకపోయినా, వారు అమ్మకాలు నిలిపివేసి కొనుగోళ్లకు రావడం కీలకమైన మార్పని, దేశీయ ఆర్థిక బలాలతో ఈ ధోరణి కొనసాగేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

Advertisement
Advertisement