Naga Durga | నో సైడ్ రోల్స్ .. ఓన్లీ హీరోయిన్ – అప్పుడే కండీషన్లు పెడుతోన్న నాగదుర్గ
ఫోక్ సింగర్ నాగదుర్గ ఒక్క సినిమాకే నిర్మాతలకు తెగ కండీషన్లు పెడుతోందట. సైడ్ రోల్స్ చేయనని అంటుందట. హీరోయిన్‌గా మాత్రమే నటిస్తానని అంటుదట. నాగదుర్గ కండీషన్లపై మిస్టర్ మిడిల్ క్లాస్ నిర్మాత చేసిన కామెంట్లు వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jul 7, 2026, 10.52 am IST
Naga Durga | ఫోక్ సింగర్ కమ్ డ్యాన్సర్ నాగదుర్గ నిర్మాతలకు కండీషన్ల మీద కండీషన్లు పెడుతోందట. ఒక్క సినిమాకే ఆమె డిమాండ్స్ విని నిర్మాతలు షాకవుతున్నట్లు సమాచారం. కవిలి వనం అనే చిన్న సినిమాతో నాగదుర్గ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా రిలీజైన విషయం కూడా తెలియకముందే థియేటర్లలో కనిపించకుండాపోయింది.
ఈ రిజల్ట్‌తో సంబంధం లేకుండా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో ఓ రెండు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లు చేస్తుంది.
ధనుష్ మేనల్లుడు హీరోగా...
ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటిస్తోన్న తమిళ మూవీ లవ్ ఓ లవ్‌లో నాగదుర్గ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీతోనే కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇటీవలే తెలుగులో ప్రియదర్శితో ఇడుపుకాయితం అనే సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. లాంఛింగ్ ఈవెంట్‌తోనే టాలీవుడ్‌లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ టైటిల్‌పై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఓపెనింగ్ ఈవెంట్‌తోనే ఇడుపుకాయితంకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.
సైడ్ రోల్స్ చేయను....
ఈ రెండు సినిమాలే కాకుండా నాగదుర్గకు చాలానే ఆఫర్లు వస్తున్నాయట. ఆమె పెడుతోన్న కండీషన్ల కారణంగా నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారట. లవ్ ఓ లవ్ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో మిస్టర్ మిడిల్ క్లాస్ నిర్మాత చందు మాట్లాడుతూ తమ సినిమాలో ఓ మెయిల్ రోల్ కోసం నాగదుర్గను సంప్రదించామని అన్నాడు. సైడ్ రోల్స్ చేయను...మెయిన్ హీరోయిన్‌గా మాత్రమే నటిస్తానని చెప్పి తమ సినిమా ఆఫర్‌ను నాగదుర్గ రిజెక్ట్ చేసిందని చందు చెప్పాడు.
పదిహేను కండీషన్లు...
ఇడుపుకాయితం ఓపెనింగ్ ఈవెంట్‌లో కూడా హీరోయిన్‌రోల్ కోసం సంప్రదిస్తే నాగదుర్గ పదిహేను కండీషన్లు పెట్టిందంటూ నిర్మాత బన్నీవాసు అన్నారు. అవేంటన్నది తర్వాత చెబుతానంటూ మాట దాటేశాడు బన్నీవాసు. గ్లామర్ రోల్స్ చేయను...కథలో నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలి... పాటలకు మాత్రమే పరిమితమయ్యే పాత్ర అయితే వద్దు... ఒకరి కంటే ఎక్కువ హీరోయిన్లు ఉంటే తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ చాలానే షరతులు విధిస్తుందట నాగదుర్గ. వాటికి ఓకే అంటేనే సినిమా చేస్తానని అంటుందట. నాగదుర్గ డిమాండ్స్ విని ఆమెను హీరోయిన్‌గా తీసుకోవాలని వచ్చిన నిర్మాతలు వెంటనే తమ నిర్ణయాలను మార్చేసుకుంటున్నారట. ఇలాగేతే హీరోయిన్‌గా రాణించడం కష్టమేనని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఫోక్ డ్యాన్సర్....
ఫోక్ డ్యాన్సర్‌గా యూట్యూబ్ సాంగ్స్‌తో ఫేమస్ అయ్యింది. నాగదుర్గ. ఆమె నటించిన పలు సాంగ్స్ వందల మిలియన్ల వ్యూస్ సాధించాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం






