Belgium Vs USA | అమెరికాపై బెల్జియం విజయం
Belgium Vs USA | ఫిఫా ప్రపంచకప్-2026 ప్రీక్వార్టర్‌ఫైనల్లో బెల్జియం అద్భుత ప్రదర్శనతో అమెరికాకు షాకిచ్చింది. సియాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో ఘన విజయం సాధించిన బెల్జియం క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది.
- 4-1 తేడాతో యూఎస్ చిత్తు
- క్వార్టర్‌ఫైనల్స్‌లో స్పెయిత్‌తో ఢీ
Belgium Vs USA | ఫిఫా ప్రపంచకప్-2026 ప్రీక్వార్టర్‌ఫైనల్లో బెల్జియం అద్భుత ప్రదర్శనతో అమెరికాకు షాకిచ్చింది. సియాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో ఘన విజయం సాధించిన బెల్జియం క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆరంభం నుంచి చివరి వరకు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన రెడ్ డెవిల్స్‌కు అమెరికా ఏ దశలోనూ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఈ విజయంతో క్వార్టర్‌ఫైనల్లో స్పెయిన్‌తో బెల్జియం తలపడనుంది.
చార్లెస్ డీ కెటెలారే డబుల్..
మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచే బెల్జియం దూకుడుగా ఆడింది. తొమ్మిదో నిమిషంలో చార్లెస్ డీ కెటెలారే గోల్ సాధించి జట్టుకు ఆధిక్యం అందించాడు. అమెరికా 31వ నిమిషంలో మాలిక్ టిల్‌మన్ చేసిన డిఫ్లెక్టెడ్ గోల్‌తో 1-1తో సమం చేసింది. అయితే, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. కేవలం రెండు నిమిషాలకే మరోసారి మెరుపువేగంతో దాడి చేసిన డీ కెటెలారే తన రెండో గోల్ నమోదు చేసి బెల్జియంను మళ్లీ ఆధిక్యంలో నిలబెట్టాడు.
విజేతను నిర్ణయించిన ద్వితీయార్ధం
రెండో అర్ధభాగంలో కూడా బెల్జియం ఆధిపత్యం కొనసాగింది. 57వ నిమిషంలో హాన్స్ వానాకెన్ మూడో గోల్ సాధించడంతో అమెరికా ఆశలు దాదాపు అడుగంటాయి. ఇంజ్యూరీ టైమ్‌లో స్టార్ స్ట్రైకర్ రొమేలు లుకాకు మరో గోల్ చేసి బెల్జియం విజయంలో తనదైన ముద్ర వేశాడు. దీంతో 4-1 స్కోరుతో రెడ్ డెవిల్స్ ఏకపక్ష విజయాన్ని అందుకుంది.
క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్‌తో పోరు
ఈ మ్యాచ్‌లో బెల్జియం అన్ని విభాగాల్లోనూ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. ఎటాకింగ్, బంతిపై ఆధిపత్యం, డిఫెన్స్‌లో క్రమశిక్షణతో ప్రత్యర్థిపై పూర్తి పట్టు సాధించింది. స్కోర్ సమం చేసిన తర్వాత కూడా అమెరికా ఆటలో లయ కనిపించలేదు. బెల్జియం ఒత్తిడిని తట్టుకోలేక వరుసగా తప్పులు చేయగా పూర్తిగా వెనుకపడిపోయింది. క్వార్టర్‌ఫైనల్లో బెల్జియం ఇప్పుడు స్పెయిన్‌ను ఢీకొట్టనుంది. ప్రీక్వార్టర్‌లో పోర్చుగల్‌ను 1-0తో ఓడించిన స్పెయిన్‌తో జరిగే ఈ పోరు టోర్నీలో అత్యంత ఆసక్తికర మ్యాచుల్లో ఇది కూడా ఒకటిగా నిలువనుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..






