త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayatollah Ali Khamenei funeral | జులై 9న ఖ‌మేనీ అంత్య‌క్రియ‌లు.. మోదీని ఆహ్వానించిన ఇరాన్‌..!

Ayatollah Ali Khamenei funeral | ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి చివ‌ర్లో అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడిలో (US-Israeli strike) ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలు వ‌చ్చే నెల‌లో నిర్వ‌హించ‌నున్నారు.

D

International | Published On Jun 24, 2026, 5.39 pm IST

Ayatollah Ali Khamenei funeral | జులై 9న ఖ‌మేనీ అంత్య‌క్రియ‌లు.. మోదీని ఆహ్వానించిన ఇరాన్‌..!
Advertisement

Ayatollah Ali Khamenei funeral | ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి చివ‌ర్లో అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడిలో (US-Israeli strike) ప్రాణాలు కోల్పోయిన ఇరాన్‌ సుప్రీం లీడర్ (Iran Supreme Leader) అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) అంత్యక్రియలు వ‌చ్చే నెల‌లో నిర్వ‌హించ‌నున్నారు. జులై 5 నుంచి అంత్య‌క్రియల‌ కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌వుతాయి. తొలుత‌ టెహ్రాన్‌, ఖోమ్ ప‌ట్ట‌ణాల్లో అంతిమ సంస్కారాల‌కు సంబంధించిన కొన్ని కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఇక జులై 9న ఖ‌మేనీ జ‌న్మించిన మ‌షాద్‌లోనే ఆయ‌న అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మోదీకి ఆహ్వానం..

ఖ‌మేనీ అంత్య‌క్రియ‌ల‌కు భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి ఆహ్వానం అందిన‌ట్లు తెలుస్తోంది. ఇరాన్ అధ్య‌క్షుడు (Iran President) మసౌద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian).. మోదీని ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం. కాగా, ఇజ్రాయెల్‌, అమెరికా మ‌ధ్య కొన‌సాగుతున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ఖ‌మేనీ అంత్య‌క్రియ‌లు దాదాపు మూడు నెల‌లుగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఇరు దేశాల మ‌ధ్య డీల్ కుద‌ర‌డంతో ఉద్రిక్త‌త‌లు చ‌ల్లారుతున్నాయి. దీంతో ఖ‌మేనీ ఖ‌న‌న సంస్కారాల‌కు అక్క‌డి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement
Advertisement