త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ట్విస్ట్‌ల‌తో సాగే వంద కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ – తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ – ఏ ఓటీటీలో చూడాలంటే?

కార్తీ హీరోగా న‌టించిన స‌ర్దార్ మూవీ తెలుగు వెర్ష‌న్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా ఈ స్పై యాక్ష‌న్ మూవీని ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. థియేట‌ర్ల‌లో వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీలో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Jul 7, 2026, 11.36 am IST

OTT | ట్విస్ట్‌ల‌తో సాగే వంద కోట్ల బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ – తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ – ఏ ఓటీటీలో చూడాలంటే?
Advertisement

OTT | కార్తీ హీరోగా న‌టించిన స‌ర్ధార్ మూవీ తెలుగుతో పాటు త‌మిళంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో రాశీఖ‌న్నా, ర‌జీషా విజ‌య‌న్ హీరోయిన్లుగా న‌టించారు. కార్తీ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించిన ఈ సినిమాకు పీఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. స‌ర్దార్ మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ లైలా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ప‌ద‌హారేళ్ల లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఈ స్పై యాక్ష‌న్ మూవీతోనే కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది లైలా.

ఆహా ఓటీటీలో...

స‌ర్దార్ మూవీ తెలుగు వెర్ష‌న్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా తెలుగు వెర్ష‌న్‌ను ఆహా ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చ‌ట‌. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా కార్తీ వెల్ల‌డించాడు. ఓ పోస్ట్ పెట్టాడు.

జ‌ల వ‌న‌రుల దోపిడీ...

జ‌ల వ‌న‌రులు ఎలా దోపిడీకి గుర‌వుతున్నాయి? ఒక‌ప్పుడు ఉచితంగా ల‌భించిన నీరు ఇప్పుడు కొనుక్కునే ప‌రిస్థితి ఎందుకొచ్చింది? మంచి నీరు పేరుతో కార్పొరేట్ సంస్థ‌లు సాగించే మోసాల‌ను సందేశాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించారు. మెసేజ్‌కు దేశ‌భ‌క్తి, ల‌వ్‌, యాక్ష‌న్ అంశాల‌ను జోడించి ఈ సినిమాను రూపొందించారు.

స‌ర్ధార్ గ‌తం...

విజ‌య్ కార్తీక్ (కార్తీ ) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. విజ‌య్ తండ్రి స‌ర్ధార్‌పై దేశ‌ద్రోహి అనే ముద్ర ప‌డుతుంది. ఆ అప‌వాదు కార‌ణంగా విజ‌య్ అనేక అవ‌మానాల‌కు గుర‌వుతాడు. దేశం మొత్తానికి మంచి నీళ్లు స‌ప్లై చేసే ఓ ప్రాజెక్ట్‌ను అడ్డుకోవ‌డానికి కొంద‌రు ప్ర‌య‌త్నిస్తారు. అనూహ్య రీతిలో వారంతా చ‌నిపోతారు. ఈ హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో విజ‌య్‌కి ఎలాంటి నిజాలు తెలిశాయి? తండ్రి స‌ర్ధార్ గ‌తం ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సీక్వెల్‌....

ప్ర‌స్తుతం స‌ర్ధార్ మూవీకి సీక్వెల్ వ‌స్తోంది. స‌ర్దార్ 2 పేరుతో తెర‌కెక్కుతోన్న మాళ‌వికా మోహ‌న‌న్‌, ఆషికా రంగ‌నాథ్ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. సెప్టెంబ‌ర్‌లో ఈ సీక్వెల్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Advertisement
Advertisement