త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGiCCC | పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భ‌ర్తీ.. వివ‌రాలివే..!

TGiCCC | బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) లో పూర్తిగా తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన (6) స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (డ్రైవర్లు) ఖాళీలను భర్తీ చేయడానికి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

S

Telangana | Published On Nov 27, 2026, 6.00 pm IST

TGiCCC | పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భ‌ర్తీ.. వివ‌రాలివే..!
Advertisement

TGiCCC | త్రినేత్ర న్యూస్ : బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) లో పూర్తిగా తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన (6) స్పెషల్ పోలీస్ ఆఫీసర్ (డ్రైవర్లు) ఖాళీలను భర్తీ చేయడానికి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ఈ పోస్టుల‌కు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికులు (Ex-Servicemen), పారామిలిటరీ దళాల (Paramilitary Forces) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అభ్యర్థులు కింది నిబంధనలకు అనుగుణంగా అర్హత కలిగి ఉంటే.. ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

అర్హ‌త‌లు ఇవే..

  • తెలంగాణ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికులు, మాజీ పారామిలిటరీ దళాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
  • తెలంగాణ రాష్ట్ర నివాస ధృవీకరణ పత్రం (ఉదాహరణకు: ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్) కలిగి ఉండాలి.
  • 30-11-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 58 సంవత్సరాల లోపు ఉండాలి. మాజీ సైనికులు, పారామిలిటరీ దళాలకు చెందిన అభ్యర్థులు, అంటే సర్వీసు నుండి పదవీ విరమణ చేసి రెండేండ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గరిష్ట వయోపరిమితి 60 సంవత్సరాలు.
  • నెలకు గౌరవ వేతనం రూ. 26,000/- మాత్రమే చెల్లించబడుతుంది. వీరికి ఎటువంటి సెలవులకు అర్హత ఉండదు. ఒకవేళ సెలవు అవసరమైతే, అది వేతనం లేని సెలవుగా పరిగణించబడుతుంది.

అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు కింది ధృవపత్రాల జిరాక్స్ కాపీలను జతపరచాలి:

  • డిశ్చార్జ్ బుక్ / డిశ్చార్జ్ సర్టిఫికెట్ / పదవీ విరమణ ఉత్తర్వులు (Retirement Order).
  • ఆధార్ కార్డు, పాన్ (PAN) కార్డు.
  • టెక్నికల్ ట్రేడ్ ప్రొఫిషియన్సీ సర్టిఫికెట్ (వర్తించే వారికి).
  • చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ (LMV/HMV).
  • గుర్తింపు కార్డు (ID Card).
  • మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ (వైద్య ధృవీకరణ పత్రం).
  • మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.

గమనిక:

ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను 27-11-2026 నుండి 30-11-2026 వరకు బంజారాహిల్స్, రోడ్ నెం. 12 లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC) రిసెప్షన్ సెంటర్‌లో సమర్పించాలి. ఫోన్ కాల్స్ అనుమతించబడవు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 30-11-2026 సాయంత్రం 5:00 గంటల వరకు.

Advertisement
Advertisement