Vibha Yadavalli | కూచిపూడి నృత్య కళాకారిణి విభా యడవల్లి అరంగేట్రం
Vibha Yadavalli | విదేశాల్లో స్థిరపడినప్పటికీ భారతీయ సంస్కృతి, కళలపై ఎన్ఆర్ఐలు మక్కువ పెంచుకుంటున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్న జ్యోత్న్స, శ్రీరామ్ యడవల్లి దంపతులు తమ కూతురు విభా యడవల్లికి (Vibha Yadavalli) చిన్ననాటి నుంచే కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇప్పిస్తున్నారు.
Vibha Yadavalli | త్రినేత్ర.న్యూస్: విదేశాల్లో స్థిరపడినప్పటికీ భారతీయ సంస్కృతి, కళలపై ఎన్ఆర్ఐలు మక్కువ పెంచుకుంటున్నారు. అమెరికాలోని టెక్సాస్‌లో ఉంటున్న జ్యోత్న్స, శ్రీరామ్ యడవల్లి దంపతులు తమ కూతురు విభా యడవల్లికి (Vibha Yadavalli) చిన్ననాటి నుంచే కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఏడేండ్ల వయస్సు నుంచే కూటిపూడిపై (Kuchipudi) మక్కువ పెంచుకున్న విభ.. ఆస్టిన్ పరిసర ప్రాంతాల్లో పలు నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తన ప్రతిభను చాటుకున్నారు. తాజాగా ఆగస్టు 1న టెక్సాస్‌లోని జార్జ్‌టౌన్‌లో ఉన్న సౌత్‌వెస్ట్రన్ యూనివర్సిటీ (Southwestern University) వేదికపై అరంగేట్రం ప్రదర్శన ఇచ్చారు. అభినయ స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విభా యడవల్లి తన నృత్యంతో ప్రేక్షకులను అలరించారు.

విభా.. తొలుత కాలిఫోర్నియాలో గురువు లక్ష్మి భవాని కొండూరు వద్ద ప్రాథమిక శిక్షణ పొందారు. 2021లో టెక్సాస్‌కు మారిన తర్వాత ప్రముఖ నాట్య గురువులు రాజి రాయప్రోలు, పసుమర్తి వెంకటేశ్వర శర్మ వద్ద శిక్షణ పూర్తి చేసుకుని, తన కళా నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు. ఇప్పటికే ఆస్టిన్ (Austin) పరిసర ప్రాంతాలలో పలు నృత్య రూపకాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విభా తన ప్రతిభను చాటుకున్నారు. శాస్త్రీయ నృత్యంతో పాటు హైస్కూల్ వర్సిటీ డాన్స్ టీమ్‌లో సభ్యురాలిగా ఉంటూ అటు సమకాలీన నృత్యంలోనూ రాణిస్తున్నారు. ఎన్నో ఏండ్ల కఠిన శిక్షణకు ప్రతిరూపంగా నిలిచే ఈ ప్రదర్శనను (రంగప్రవేశాన్ని) ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందని, తనకు సహకరించిన గురువులకు, కుటుంబ సభ్యులకు విభా కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..
- ●Ukraine Biggest Attack | మాస్కోపై 1,600కుపైగా డ్రోన్లతో విరుచుకుపడిన ఉక్రెయిన్..!
- ●Delhi SIR | ఎస్ఐఆర్లో ప్రముఖులకూ షాక్.. అద్వానీ, కేజ్రీవాల్ సహా పలువురికి నోటీసులు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర

Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..

Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..



