Fuel prices | ముడి చమురు తగ్గినా.. ఇంధన ధరలను వెంటనే తగ్గించలేం: కేంద్రం
Fuel prices | మధ్యప్రాచ్యంలో గత మూడు నెలలుగా కొనసాగిన సంక్షోభానికి (America Iran War) తెర పడటంతో ముడి చమురు ధరలు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన మన దేశంలో ఇంధన ధరలను (Fuel prices) వెంటనే తగ్గిండచం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
Fuel prices | ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం (America Iran War) ముగిసింది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) డిజిటల్‌గా సంతకాలు చేశారు. ఈ డీల్‌తో మధ్యప్రాచ్యంలో గత మూడు నెలలుగా కొనసాగిన సంక్షోభానికి తెర పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు (global crude rates) తగ్గనున్నాయి. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Fuel prices) కూడా తగ్గే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్రం తాజాగా స్పందించింది.
పశ్చిమాసికా సంక్షోభం కారణంగా మన దేశంలో ఇంధన ధరలను లీటరుకు రూ.3.94 మేర మాత్రమే పెంచినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి (Union Minister Suresh Gopi) తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన మన దేశంలో ఇంధన ధరలను వెంటనే తగ్గిండచం సాధ్యం కాదని స్పష్టం చేశారు. తక్కువ ధరకు లభించే ముడి చమురు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా భారత్‌కు రవాణా కావడానికి ఇంకా సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం ఆ మార్గంలో ఓడల రాకపోకల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావాల్సి ఉందన్నారు. ఈ కారణాలతో పాటు మరికొన్ని ఆర్థిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన ధరలను వెంటనే తగ్గించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో మధ్యప్రాచ్యంలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చమురు కంపెనీలు తీవ్రంగా ప్రభావితమైనట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఆ ప్రభావాన్ని చాలా వరకూ కేంద్రమే భరించిందన్నారు. ఫలితంగా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని వివరించారు. ఇంధన ధరలు పెరిగినప్పుడు తమ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించుకుని ప్రజలకు ఊరట కల్పించేందుకు ఏ రాష్ట్రం కూడా ముందుకు రాలేదన్నారు. దీంతో ఆర్థిక భారం అంతా కేంద్ర ప్రభుత్వంపైనే పడిందని పేర్కొన్నారు. ఇంధన ధరలను నియంత్రించేందుకు కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సుమారు రూ.12 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని సురేశ్ గోపీ వెల్లడించారు.
Also Read..
మేడ్చల్‌లో కారు.. లింగాలఘనపూర్‌లో మినీ ట్రక్కు.. వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం
రెచ్చిపోయిన కేన్.. క్రొయేషియాపై ఇంగ్లండ్ థ్రిల్లింగ్ విక్టరీ!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US MQ-9 Reaper | ఫైటర్ జెట్ కంటే ఖరీదైన అమెరికా ‘MQ-9 రీపర్’ డ్రోన్‌ను కూల్చేసిన ఇరాన్.. మరి భారత్ వద్ద ఉన్న డ్రోన్ల సంగతేంటి?
ఆగస్టు 31, 2026

Strait of Hormuz | హోర్ముజ్‌లో ఉద్రిక్తతలు ఉన్నా, కొనసాగుతున్న చమురు రవాణా..అమెరికా ఇంధన శాఖ మంత్రి వెల్లడి..
ఆగస్టు 22, 2026

Strait of Hormuz | హార్ముజ్ జలసంధి మాదే.. ఒమన్ అడ్డువస్తే బాంబులేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్, బదులిచ్చిన టెహ్రాన్!
ఆగస్టు 18, 2026
తాజావార్తలు
- ●Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్
- ●Jajula Srinivas Goud | కాంగ్రెస్‌ను ప్రజలే బర్తరఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్
- ●Konda Murali | మీసం మెలేసిన కొండా మురళీ.. దేనికి సంకేతం..?
- ●Ranveer Singh | లగ్జరీ కారు కొన్న ధురంధర్ హీరో - బాలీవుడ్లో సెకండ్ సెలిబ్రిటీ
- ●Harish Rao vs Revanth Reddy | కాంగ్రెస్ 1000 రోజుల పాలన మొత్తం సెటిల్మెంట్లే.. దమ్ముంటే కౌడిపల్లికి రా..!
- ●Konda Surekha | నేను ఏ తప్పు చేయలేదు.. తలెత్తుకుని బతుకుతా.. ఎమ్మెల్యేగా కొనసాగుతా

Dasoju Sravan Press Meet | వైట్ కాలర్ క్రిమినల్ పొంగులేటి.. సీఎం పదవి కొనుక్కున్న రేవంత్

Jajula Srinivas Goud | కాంగ్రెస్‌ను ప్రజలే బర్తరఫ్ చేస్తారు : జాజుల శ్రీనివాస్ గౌడ్

Konda Murali | మీసం మెలేసిన కొండా మురళీ.. దేనికి సంకేతం..?

Ranveer Singh | లగ్జరీ కారు కొన్న ధురంధర్ హీరో - బాలీవుడ్లో సెకండ్ సెలిబ్రిటీ



