BJP | ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రూ.529 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ.. బెంగాల్‌లోనే అత్యధికం
BJP | అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ (BJP) ఏకంగా రూ.529 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం వ్యయంలో సింహభాగం పశ్చిమ బెంగాల్‌లోనే ఖర్చు చేయడం గమనార్హం.
BJP | త్రినేత్ర న్యూస్ : ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారీగా ఖర్చు పెట్టింది. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం ఏకంగా రూ.529 కోట్లు ఖర్చు చేసింది. ఈ మొత్తం వ్యయంలో సింహభాగం పశ్చిమ బెంగాల్‌లోనే ఖర్చు చేయడం గమనార్హం. కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) పార్టీ సమర్పించిన వ్యయ నివేదికల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఆ వివరాల ప్రకారం.. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ రూ.286.99 కోట్లు ఖర్చు పెట్టింది. అభ్యర్థుల కోసం మరో రూ.70 కోట్లు ఖర్చు పెట్టింది. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చులు, మీడియా ప్రకటనలకు భారీగా ఖర్చు చేసింది. బెంగాల్ తర్వాత అస్సాంలో రూ.96.26 కోట్లు, కేరళలో రూ.82.67 కోట్లు, తమిళనాడులో రూ.51.56 కోట్లు, పుదుచ్చేరిలో రూ.11.89 కోట్లు ఖర్చు చేసింది.
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో విరాళాలు, ఇతర మార్గాల ద్వారా బీజేపీకి రూ.1494 కోట్ల భారీ నిధులు సమకూరాయి. అయితే, ఎన్నికల ప్రక్రియ ముగిసే నాటికి ఖర్చులన్నీ పోను పార్టీ కేంద్ర కార్యాలయ ఖాతాలో ఏకంగా రూ.7,689 కోట్లు ఉన్నట్లు బీజేపీ తెలిపింది. ఇక పార్టీల పరంగా చూస్తే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో డీఎంకే (DMK) రూ. 197.85 కోట్లు, అన్నాడీఎంకే (AIADMK) రూ. 112.40 కోట్లు, కాంగ్రెస్ (Congress) రూ. 95.52 కోట్లు, సీపీఎం (CPI-M) రూ. 39.04 కోట్లు ఖర్చు చేసింది.
కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. 15 ఏళ్ల టీఎంసీ పాలనకు కాషాయ పార్టీ ఘనంగా ముగింపు పలికింది. 294 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 206 స్థానాల్లో జయభేరి మోగించి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఫలితంగా బెంగాల్‌లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read..
దానం అనర్హతకు కోర్టు గుర్తించిన మూడు కీలక ఆధారాలు ఇవే !
11 ఏళ్ల కల.. లాయర్లు, ఆటో డ్రైవర్లు క్యూ కట్టి మరీ కొంటున్న అరిటాకు దమ్ బిర్యానీ స్పెషాలిటీ ఇదే..!
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●దానం పదవి ఎందుకు పోయింది? తీర్పులో కీలకమైన మూడు అంశాలు ఇవే
- ●Anija Biryani Trivandrum | 11 ఏళ్ల కల.. లాయర్లు, ఆటో డ్రైవర్లు క్యూ కట్టి మరీ కొంటున్న అరిటాకు దమ్ బిర్యానీ స్పెషాలిటీ ఇదే..!
- ●Raksha Expo 2026 | గ్లోబల్ సమ్మిట్‌లో ‘రక్షా ఎక్స్‌పో 2026’
- ●Vishnu Priya | ఓటీటీలోకి విష్ణుప్రియ రొమాంటిక్ కామెడీ మూవీ - ఇంద్రలోకం నుంచి అప్సరసలు భూమిపైకి వస్తే !
- ●Advocate Dundu Manmohan | దుండు మన్మోహన్కు సీనియర్ అడ్వకేట్ హోదా.. ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు
- ●Ponnam Prabhakar | 'సర్'పై ఎన్నో అనుమానాలు

దానం పదవి ఎందుకు పోయింది? తీర్పులో కీలకమైన మూడు అంశాలు ఇవే

Anija Biryani Trivandrum | 11 ఏళ్ల కల.. లాయర్లు, ఆటో డ్రైవర్లు క్యూ కట్టి మరీ కొంటున్న అరిటాకు దమ్ బిర్యానీ స్పెషాలిటీ ఇదే..!

Raksha Expo 2026 | గ్లోబల్ సమ్మిట్‌లో ‘రక్షా ఎక్స్‌పో 2026’

Vishnu Priya | ఓటీటీలోకి విష్ణుప్రియ రొమాంటిక్ కామెడీ మూవీ - ఇంద్రలోకం నుంచి అప్సరసలు భూమిపైకి వస్తే !






