త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవ‌రో తెలుసా?

Arshdeep Singh | టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జీవితంలో నవంబర్ 11న‌ ప్రత్యేక రోజుగా నిలిచింది. ఒకవైపు ఐపీఎల్ ట్రేడ్ డీల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి మారగా.. మరోవైపు తన ప్రియురాలు సమ్రీన్ కౌర్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సమ్రీన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని చూపిస్తూ ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

P

Sports | Published On Nov 11, 2026, 8.45 pm IST

Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవ‌రో తెలుసా?
Advertisement

Arshdeep Singh | టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ జీవితంలో నవంబర్ 11న‌ ప్రత్యేక రోజుగా నిలిచింది. ఒకవైపు ఐపీఎల్ ట్రేడ్ డీల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులోకి మారగా.. మరోవైపు తన ప్రియురాలు సమ్రీన్ కౌర్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సమ్రీన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని చూపిస్తూ ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.

జీవితాంతం కలిసే ఉంటాం..

అర్ష్‌దీప్‌కు ఉంగరం తొడుగుతున్న ఫొటోతోపాటు మరికొన్ని అందమైన చిత్రాలను సమ్రీన్ షేర్ చేసింది. ‘జీవితం మనకు ఎన్నో ఇచ్చి ఉండొచ్చు. కానీ మనల్ని కలిపిన దానికంటే గొప్ప బహుమతి మరొకటి లేదు. జీవితాంతం మన ప్రయాణం ఇలాగే కలిసి సాగాలి’ అంటూ భావోద్వేగమైన క్యాప్షన్ జత చేసింది. నవంబర్ 11, 2026 తేదీని పేర్కొంటూ తనను అర్ష్‌దీప్‌కు కాబోయే భార్యగా పరిచయం చేసుకుంది. దీంతో వీరి నిశ్చితార్థం విషయం అధికారికంగా వెలుగులోకి వచ్చింది.

ఎవరీ సమ్రీన్ కౌర్?

అర్ష్‌దీప్ కాబోయే భార్య సమ్రీన్ కౌర్ పంజాబీ నటి, మోడల్. 2018 మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆమె పుణెలోని సింబయాసిస్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో చదువుకుంది. పలు మ్యూజిక్ వీడియోలతోపాటు హిందీ, పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. కొంతకాలంగా అర్ష్‌దీప్‌తో ప్రేమలో ఉన్న సమ్రీన్.. గతంలో అతడి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన పోస్టులతో తమ బంధాన్ని బహిరంగం చేసింది.

పంజాబ్ నుంచి ముంబ‌యికి అర్ష్‌దీప్

మరోవైపు ఐపీఎల్‌లోనూ అర్ష్‌దీప్ కొత్త జట్టులోకి మారాడు. ట్రేడ్ డీల్‌లో భాగంగా ముంబ‌యి ఇండియన్స్ నుంచి హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లగా.. అర్ష్‌దీప్ ముంబ‌యి జట్టులో చేరాడు. రూ.18 కోట్ల ప్రస్తుత ధరతో అర్ష్‌దీప్ ముంబ‌యికి మారినట్లు ఐపీఎల్ వెల్లడించింది. పంజాబ్ కింగ్స్‌కు రూ.16.35 కోట్లకు పైగా ప్రస్తుత ధరతో హార్దిక్ చేరాడు. 2019లో పంజాబ్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. ఎనిమిది సీజన్ల పాటు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పటివరకు 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టి పంజాబ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

 

View this post on Instagram

 

A post shared by Samreen (@samreenkaur__)

 

Advertisement
Advertisement