త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS క‌నీసం స్వాతంత్య్ర‌ పోరాటంలోనూ పాల్గొన‌లేదు : ప్రియాంక్ ఖ‌ర్గే

Priyank Kharge | మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాన్ (Tipu Sultan) బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల్లో పాల్గొన్నార‌ని క‌ర్ణాట‌క మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే (Priyank Kharge) గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ మాత్రం భారత స్వాతంత్య్ర‌ పోరాటంలో కూడా పాల్గొన‌లేద‌ని విమ‌ర్శించారు.

D

National | Published On Nov 10, 2026, 4.23 pm IST

Priyank Kharge | టిప్పు సుల్తాన్ నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు.. RSS క‌నీసం స్వాతంత్య్ర‌ పోరాటంలోనూ పాల్గొన‌లేదు : ప్రియాంక్ ఖ‌ర్గే
Advertisement

Priyank Kharge | త్రినేత్ర న్యూస్ : మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాన్ (Tipu Sultan) జ‌యంతిని వ్య‌తిరేకిస్తున్న ఆర్ఎస్ఎస్‌, బీజేపీపై క‌ర్ణాట‌క మంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే (Priyank Kharge) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాల్లో (Anglo-Mysore Wars) పాల్గొన్నార‌ని గుర్తు చేశారు. ఆర్ఎస్ఎస్ మాత్రం భారత స్వాతంత్య్ర‌ పోరాటంలో కూడా పాల్గొన‌లేద‌ని విమ‌ర్శించారు.

టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను తిరిగి నిర్వ‌హించాల‌ని, పాఠ్యపుస్తకాల్లో టిప్పు సుల్తాన్ చరిత్రను చేర్చాలని కోరుతూ 'తెహ్రీక్-ఎ-ఖుదాదాద్' అనే సాంస్కృతిక సంస్థ కర్ణాటక ప్రభుత్వానికి ఒక వినతిపత్రం సమర్పించింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ప్రియాంక్ ఖర్గే.. టిప్పు సుల్తాన్ జయంతిని వ్యతిరేకిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) లక్ష్యంగా ఘాటు విమర్శలు చేశారు.

"బీజేపీ తమ చరిత్రను సరిదిద్దుకోవాలి. టిప్పు సుల్తాన్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా నాలుగు ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు చేశారు. కానీ బీజేపీకి సిద్ధాంతకర్త అయిన ఆర్ఎస్ఎస్ (RSS) భారతదేశ స్వాతంత్య్ర‌ పోరాటంలో కనీసం పాల్గొననే లేదు. శాసనోల్లంఘన ఉద్యమం (Civil Disobedience Movement), క్విట్ ఇండియా ఉద్య‌మం (Quit India Movement), దండి మార్చ్‌ (Dandi March), సహాయ నిరాకరణ ఉద్యమాల్లోనూ పాలుపంచుకోలేదు. రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ (Round Table Conferences) భాగస్వామ్యం కాలేదు. అయినా ఇప్పుడు వారే షరతులు విధిస్తున్నారు" అంటూ ప్రియాంక్ ఖ‌ర్గే ధ్వ‌జ‌మెత్తారు.

ఈ సంద‌ర్భంగా బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప గతంలో ఒక పుస్తకంలో టిప్పు సుల్తాన్‌ను ప్రశంసించిన విష‌యాన్ని ప్రియాంక్ ఖ‌ర్గే గుర్తుచేశారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమ‌ర్శించారు. "యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టిప్పు సుల్తాన్‌ జయంతిని బీజేపీ వ్యతిరేకించింది. అయినప్పటికీ ఆయన ఒక పుస్తకంలో టిప్పు సుల్తాన్‌ను ప్రశంసించారు. రాష్ట్రానికి టిప్పు సుల్తాన్ చేసిన కృషిని మీరు చెరిపివేయలేరు. బీజేపీ ఓట్ల కోసం మైనారిటీ అనుకూల వైఖరిని అవలంబిస్తూ.. ఆ తర్వాత మాట మారుస్తూ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోంది" అని విమ‌ర్శించారు.

Also Read..

ప్రపంచంలోని అత్యంత క‌లుషిత‌మైన 50 నగరాల్లో 47 భారత్‌లోనే..!

భార‌త్ స‌మ్మిట్‌కు రాహుల్ వ‌స్తున్నారు

డీప్‌ఫేక్ బారిన ప‌డిన శ్రీలీల? - ఫొటోల‌పై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌

Advertisement
Advertisement