Gold Price | బంగారం ధరలకు మళ్లీ బ్రేక్.. ఒక్కరోజే రూ.800 డౌన్.. వెండి రూ.5వేలు పతనం
Gold Price | పండుగల వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారంపై రూ.800 తగ్గి రూ.1,45,600కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది.
Gold Price | పండుగల వేళ బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో పసిడి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. బుధవారం 10 గ్రాముల 99.9 శాతం స్వచ్ఛమైన బంగారంపై రూ.800 తగ్గి రూ.1,45,600కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పడిపోయింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గడంతో ధర రూ.1,87,500కు చేరుకుంది. దీపావళి సెలవుల కారణంగా మార్కెట్‌లో లావాదేవీలు మందగించడం ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణంగా మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో భిన్నమైన పరిస్థితి
దేశీయ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పటికీ అంతర్జాతీయంగా మాత్రం పసిడి, వెండి ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4,047.71 డాలర్ల వద్ద ట్రేడవగా.. వెండి దాదాపు 3 శాతం పెరిగి ఔన్స్‌కు 52.86 డాలర్లకు చేరింది. గత సెషన్‌లో భారీగా పడిపోయిన తర్వాత బంగారం ధరలు 4,051 డాలర్ల స్థాయి వద్ద స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నాయని మిరే అసెట్ షేర్‌ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్ సింగ్ తెలిపారు.
బంగారంపై ఒత్తిడి ఎందుకు?
దీపావళి సెలవుల నేపథ్యంలో దేశీయ మార్కెట్లలో ట్రేడింగ్ కార్యకలాపాలు తగ్గాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. దాంతో పసిడి ధరలపై ఒత్తిడి పెరిగిందన్నారు. మరోవైపు అమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అనుసరిస్తున్న వైఖరి కూడా బంగారం ధరల కదలికలను ప్రభావితం చేస్తున్నాయి. డాలర్ విలువ, అమెరికా ట్రెజరీ బాండ్ల రాబడులు పెరిగితే పసిడి ధరలు కోలుకోవడం కష్టమవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
భౌగోళిక రాజకీయ పరిణామాల ప్రభావం
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఆశలు పెరగడం కూడా మార్కెట్ దృష్టిని ఆకర్షిస్తోంది. యుద్ధం ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినప్పటికీ.. ఆస్తుల విడుదల, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడం, ఆంక్షల తొలగింపు వంటి డిమాండ్లపై ఇరాన్ పట్టుబడుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ దాడులు నిలిపివేయాలని కోరుతోంది. ఈ పరిణామాలు బంగారం, ముడి చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
పసిడి ధరలు మరింత తగ్గుతాయా?
గత పది రోజుల్లో ముడి చమురు ధరలు దాదాపు 25 శాతం తగ్గినట్లు ప్రవీణ్ సింగ్ తెలిపారు. శాంతి చర్చల్లో స్పష్టమైన పురోగతి లేకపోతే చమురు ధరల్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని అంచనా వేశారు. సమీప కాలంలో బంగారం ధరలపై ప్రతికూల ఒత్తిడి కొనసాగే అవకాశముందని, భారీగా పెరిగే అవకాశాలు పరిమితంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ కదలికలు, ద్రవ్యోల్బణ పరిస్థితులను బట్టి పసిడి ధరల్లో మార్పులు ఉండొచ్చని పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
నవంబర్ 11, 2026

Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్!
నవంబర్ 11, 2026

Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవరో తెలుసా?
నవంబర్ 11, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
- ●Rakul Preet Singh | స్టైల్ ఐకాన్‌గా రకుల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదిరే పోజులు!
- ●Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్!
- ●Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవరో తెలుసా?
- ●Uppal Flyover Delay | ఉప్పల్ ఫ్లైఓవర్‌కు 8 ఏళ్లు.. జూన్ 2027 నాటికైనా గోస తీరేనా? ట్రాఫిక్, దుమ్ములో ప్రజల నిత్య నరకం
- ●Amul Milk Price Hike | సామాన్యులకు షాక్.. అమూల్ పాల ధరలు పెంపు

CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి

Rakul Preet Singh | స్టైల్ ఐకాన్‌గా రకుల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదిరే పోజులు!

Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్!

Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవరో తెలుసా?



