త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్‌!

Kavya-Anirudh Wedding | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్‌ 11న గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరిగిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లో ఈ జంట మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది.

P

Sports | Published On Nov 11, 2026, 9.01 pm IST

Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్‌!
Advertisement
  • పెళ్లికి రజనీకాంత్‌, ఎంకే స్టాలిన్‌ హాజరు..
  • నవంబర్‌ 21న చెన్నైలో రిసెప్షన్‌

Kavya-Anirudh Wedding | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్‌ 11న గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరిగిన డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లో ఈ జంట మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

పెళ్లి వేడుకలో రజనీకాంత్‌, స్టాలిన్‌ సందడి

ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఓ ఫొటోను నిర్మాత ఏవీ సురేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో దయానిధి మారన్‌, ఆయన కుమార్తెతో కలిసి సెల్ఫీ దిగిన ఫొటోదిగారు. ఈ ఫొటోలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, ఆయన భార్య లతా రజనీకాంత్‌ కూడా కనిపించారు. వేడుకకు హాజరైన స్టాలిన్‌, రజనీకాంత్‌ సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరి రాకతో పెళ్లి వేడుకలో ప్ర‌త్యేకార్ష‌ణ‌గా నిలిచారు.

నా జీవితంలో ఒక్కసారొచ్చే క్షణం..

వివాహానికి సంబంధించిన ఫొటోలను అనిరుధ్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘నా జీవితంలో ఒక్కసారే వచ్చే అద్భుతమైన క్షణం.. జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి’ అనే అర్థం వచ్చేలా ‘My once in a lifetime, for a lifetime 11.11’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. నవంబర్‌ 10న ఈ జంట నిశ్చితార్థం జ‌రిగింది.

ఎవరీ కావ్య మారన్‌?

కావ్య మారన్‌ సన్‌ గ్రూప్‌ అధినేత కళానిధి మారన్‌, కావేరి మారన్‌ దంపతుల కుమార్తె. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ సీఈవోగా, సన్‌ టీవీ నెట్‌వర్క్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలో కనిపిస్తూ క్రికెట్‌ అభిమానులకు కూడా ఆమె సుప‌రిచిత‌మే.

సంగీతంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు

మరోవైపు అనిరుధ్‌ రవిచందర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘వై దిస్‌ కొలవెరి డి’ పాటతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుస హిట్‌ ఆల్బమ్‌లతో దూసుకుపోయారు. ‘వేలై ఇల్లా పట్టదారి’, ‘కత్తి’, ‘పేట’, ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘జైలర్‌’, ‘లియో’, ‘వేట్టయన్‌’, ‘కూలీ’, ‘జన నాయగన్‌’ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. తనదైన బాణీలు, ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌తో దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర సంగీత దర్శకుల్లో ఒకరిగా ఎదిగాడు.

చెన్నైలో భారీ రిసెప్షన్‌

గ్రీస్‌లో వివాహ వేడుక ముగిసిన నేపథ్యంలో ఈ జంట చెన్నైలో మరో భారీ వేడుకకు సిద్ధమవుతోంది. నవంబర్‌ 21న రిసెప్షన్ నిర్వ‌హించ‌నున్నారు. వేడుకకు హాజరు కావాల్సిందిగా కావ్య తల్లిదండ్రులు కళానిధి, కావేరి మారన్‌ ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని కలిసి ఆహ్వానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్‌ విజయ్‌తోపాటు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించారు.

 

View this post on Instagram

 

A post shared by Anirudh (@anirudhofficial)

Advertisement
Advertisement