CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రకృతి వనరులను పరిరక్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనుల అనంతరం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
- మూసీకి పునరుజ్జీవం కల్పిస్తాం..
- ఆక్రమణల చెర నుంచి చెరువులను విడిపిస్తాం
- తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవంలో సీఎం కీలక వ్యాఖ్యలు..
- హీరో అక్కినేని నాగార్జునపై ప్రశంసల వర్షం
CM Revanth Reddy | హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతోపాటు ప్రకృతి వనరులను పరిరక్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని తమ్మిడికుంట చెరువు అభివృద్ధి పనుల అనంతరం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొన్ని కుటుంబాలకు ఇబ్బందులు ఎదురైనా.. రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు అందించాలనే ఉద్దేశంతోనే చెరువును అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఒకప్పుడు 14 ఎకరాలకు కుంచించుకుపోయిన తమ్మిడికుంటను తిరిగి 30 ఎకరాలకు విస్తరించామని వెల్లడించారు. ఈ అభివృద్ధి కోసం ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున ముందుకొచ్చి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వానికి అందించడం అభినందనీయమన్నారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ నాగార్జున హీరోగా నిలిచారని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
చెరువుల ఆక్రమణలతో నగరానికి ముప్పు
హైదరాబాద్‌ను ఒకప్పుడు రాక్స్ అండ్ లేక్స్ సిటీగా పిలిచేవారని సీఎం గుర్తుచేశారు. నగరంలో 1,372 చెరువులు ఉండగా.. వివిధ కారణాలతో వాటిలో సగానికిపైగా కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువుల ఆక్రమణల కారణంగా వర్షాలు కురిసినప్పుడు రోడ్లపై నీరు నిలవడం, కాలనీలు జలమయం కావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. చెరువులను కాపాడుకోవడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో పర్యావరణ సమతుల్యతను కాపాడటంతోపాటు భవిష్యత్తు తరాలకు సహజ వనరులను అందించేందుకు చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
మూసీకి పునరుజ్జీవం కల్పిస్తాం
మూసీ నది ప్రక్షాళనపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మూసీ వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు నిజాం ప్రభుత్వం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించిందని గుర్తుచేశారు. వికారాబాద్ ప్రాంతంలో ప్రారంభమయ్యే మూచుకుందా నది, మూసా, ఈసా నదులు కలిసే ప్రాంతంలో మూసీగా మారుతుందని వివరించారు. ప్రపంచంలోని అనేక నాగరికతలు నదుల ఆధారంగానే అభివృద్ధి చెందాయని, ఈ విషయాన్ని వందేళ్ల క్రితమే గుర్తించిన పాలకులు మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం మూసీ తీవ్ర కాలుష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. నది కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందన్నారు. అందుకే మూసీకి పునరుజ్జీవం కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. మూసీ సుందరీకరణ మాత్రమే తమ ఉద్దేశం కాదని, నదిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి పునరుజ్జీవం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. త్వరలోనే తొలి దశ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఎవరికీ నష్టం జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
తమ్మిడికుంటతో లేక్ ఎకానమీకి ఊతం
తమ్మిడికుంటను అభివృద్ధి చేయడం ద్వారా నగర ప్రజలకు మరో ఆహ్లాదకరమైన ప్రదేశం అందుబాటులోకి వచ్చిందని సీఎం అన్నారు. నిన్నటి వరకు శిల్పారామం గురించి మాట్లాడుకున్న ప్రజలు.. ఇకపై తమ్మిడికుంట గురించి కూడా మాట్లాడుకుంటారని వ్యాఖ్యానించారు. ఇక నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాదు.. వర్క్ ఫ్రమ్ తమ్మిడికుంట అనేలా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు. చెరువు పరిసరాల్లో భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఇక్కడ లేక్ ఎకానమీని అభివృద్ధి చేయాలని సూచించారు. చెరువు ఆవరణలో జమ్మి చెట్టు నాటాలని అధికారులకు సూచించారు. అలా చేస్తే భవిష్యత్తులో దసరా వేడుకలకు చెరువులు వేదికలుగా మారతాయని, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో చెరువులు, నదుల పరిరక్షణకు కీలక స్థానం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతిని కాపాడుకుంటూనే నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమని తెలిపారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rakul Preet Singh | స్టైల్ ఐకాన్‌గా రకుల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదిరే పోజులు!
- ●Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్!
- ●Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవరో తెలుసా?
- ●Uppal Flyover Delay | ఉప్పల్ ఫ్లైఓవర్‌కు 8 ఏళ్లు.. జూన్ 2027 నాటికైనా గోస తీరేనా? ట్రాఫిక్, దుమ్ములో ప్రజల నిత్య నరకం
- ●Amul Milk Price Hike | సామాన్యులకు షాక్.. అమూల్ పాల ధరలు పెంపు
- ●Delhi Winter Fog Science | ఢిల్లీని కమ్మేసే దట్టమైన పొగమంచు.. హైదరాబాద్, బెంగళూరుల్లో ఎందుకు కనిపించదు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?

Rakul Preet Singh | స్టైల్ ఐకాన్‌గా రకుల్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదిరే పోజులు!

Kavya-Anirudh Wedding | గ్రీస్‌లో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి వేడుక.. ఫొటోలు వైరల్!

Arshdeep Singh | టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం.. ప్రియురాలు ఎవరో తెలుసా?

Uppal Flyover Delay | ఉప్పల్ ఫ్లైఓవర్‌కు 8 ఏళ్లు.. జూన్ 2027 నాటికైనా గోస తీరేనా? ట్రాఫిక్, దుమ్ములో ప్రజల నిత్య నరకం



