త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devano Sathish Madiga | మీ పార్టీలు మా వాడ‌ల‌కొస్తే మైల ప‌డ‌వా? మేం ఓట్లేస్తే మీ గుర్తులు మైల ప‌డ‌వా?

Devano Sathish Madiga | తాము మీ ఇండ్ల ద‌గ్గ‌ర‌కొస్తే పసుపు నీళ్ల‌తో శుద్ధి చేస్తున్నార‌ని.. మ‌రి మీ రాజ‌కీయ పార్టీలు మా వాడ‌ల‌కొస్తే మైల ప‌డ‌వా అని మాదిగ, మాల జేఏసీ చైర్మ‌న్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవ‌ని స‌తీశ్ మాదిగ ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Oct 4, 2026, 4.27 pm IST

Devano Sathish Madiga | మీ పార్టీలు మా వాడ‌ల‌కొస్తే మైల ప‌డ‌వా? మేం ఓట్లేస్తే మీ గుర్తులు మైల ప‌డ‌వా?
Advertisement
  • రాజ్యాంగ చ‌ట్టాలు తెలిసి కూడా ప‌సుపు నీళ్ల‌తో శుద్ధి చేయించ‌డ‌మేంటి?
  • మిమ్మ‌ల్ని కూడా మా వాడ‌ల్లోకి రానీయం
  • మాదిగ డప్పు, మాల గుతుపల ర్యాలీలో దేవ‌ని స‌తీశ్ మాదిగ హెచ్చ‌రిక‌

Devano Sathish Madiga | త్రినేత్ర న్యూస్‌: తాము మీ ఇండ్ల ద‌గ్గ‌ర‌కొస్తే పసుపు నీళ్ల‌తో శుద్ధి చేస్తున్నార‌ని.. మ‌రి మీ రాజ‌కీయ పార్టీలు మా వాడ‌ల‌కొస్తే మైల ప‌డ‌వా అని మాదిగ, మాల జేఏసీ చైర్మ‌న్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవ‌ని స‌తీశ్ మాదిగ ప్ర‌శ్నించారు. తాము ఓట్లేస్తే మీ పార్టీల గుర్తులు మైల ప‌డ‌వా అని నిల‌దీశారు. రాజ్యాంగ చట్టాలు తెలిసి కూడా కేసీఆర్‌ తన ఫామ్‌హౌస్ దగ్గరికి దళితులు వెళ్తే శుద్ధి చేయించడం ఆర్టికల్ 17ను ఉల్లంఘించడమేన‌న్నారు. దసరా పండుగ ముందు సిద్దిపేటలో1000 డప్పులతో నిరసన దండోరా వేస్తామని ప్రకటించారు. మాదిగ డప్పు, మాల గుతుపలతో ఆదివారం హైద‌రాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మీద చేప‌ట్టిన నిరసన ర్యాలీ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు.

ఉత్తరాఖండ్‌లో రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌కు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖ‌ర్గే హాజరయ్యారు. మైదానం మైల పడిందని బీజేపీ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. కేసీఆర్, బీజేపీ ఆర్టికల్ 17ను ఉల్లంఘించాయి. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ భారత రాజ్యాంగ చట్టాలు తెలిసి పసుపు నీళ్లతో శుద్ధి చేయించాడు. తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో బీజేపీ అంటరానితనాన్ని ప్రోత్సహిస్తూ రాజ్యాంగాన్ని, చట్టాలను అవమానిస్తున్నారు.

బీఆర్ఎస్‌, బీజేపీని మ‌న వాడల్లోకి రానీయొద్దు..

కేసీఆర్ పార్టీని, బీజేపీని దళితవాడల్లోకి రానీయకుండా తరిమివేయాలని దళిత సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో, మండలాల్లో ప్రతి గ్రామంలో దండోరా కార్యక్రమాలు చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. మాదిగలు డప్పులతో, మాలలు గుతుపలతో ఈ రాజకీయ పార్టీలను త‌ర‌మాలి.

ఈ నిర‌స‌న ర్యాలీలో మాల మహానాడు గ్రేటర్ అధ్యక్షులు బైండ్ల శ్రీనివాస్, దళిత సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చిన్న పాగా రాములు, థామస్ మాదిగ హుస్నాబాద్, కరీంనగర్ జిల్లా, మాంకాళి రాంచంద్రం (సిద్దిపేట జిల్లా), బొల్లె సైదులు (సూర్యాపేట జిల్లా), మిద్దె మల్లేష్ (నాగర్ కర్నూల్ జిల్లా), బాల్ రాజ్ (గాగిల్లాపూర్, మేడ్చల్ జిల్లా), సత్యనారాయణ అగ్రహారం (పొట్లపల్లి, మహబూబ్ నగర్ జిల్లా), వీరస్వామి (వనపర్తి జిల్లా), మారేపాక గిరి (నల్లగొండ జిల్లా), దైద శ్యామ్ సుందర్ (అడ్డగుట్ట), మోజెస్, జగద్గిరిగుట్టకు చెందిన మాదిగలు వందలాది డప్పులతో పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement