త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Koyel Mallick | రాజ్య‌స‌భ‌ బ‌రిలో ప్ర‌ముఖ న‌టి.. బీజేపీలో చేరిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే

Koyel Mallick | ప్ర‌ముఖ బెంగాల్ న‌టి కొయెల్ మ‌ల్లిక్ (Koyel Mallick) రాజ్య‌స‌భ బ‌రిలో నిలిచారు. బీజేపీ (BJP) అభ్య‌ర్థిగా ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

D

National | Published On Oct 5, 2026, 4.23 pm IST

Koyel Mallick | రాజ్య‌స‌భ‌ బ‌రిలో ప్ర‌ముఖ న‌టి.. బీజేపీలో చేరిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే
Advertisement

Koyel Mallick | త్రినేత్ర న్యూస్ : ప‌శ్చిమ బెంగాల్ (West Bengal) రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ బెంగాల్ న‌టి కొయెల్ మ‌ల్లిక్ (Koyel Mallick) రాజ్య‌స‌భ బ‌రిలో నిలిచారు. బీజేపీ (BJP) అభ్య‌ర్థిగా ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు. కొయెల్ మల్లిక్ ఈ ఏడాది ఏప్రిల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం (TMC Rajya Sabha MP) చేసిన విష‌యం తెలిసిందే. అయితే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓటమి తర్వాత ఆమె జులైలో తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

ఇవాళ ఉద‌య‌మే ఆమె బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆమె బీజేపీ అభ్య‌ర్థిగా తాను రాజీనామా చేసిన స్థానం నుంచే మ‌ళ్లీ ఉప ఎన్నిక‌బ‌రిలో నిలిచారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో ఆమె ఇవాళ ఉద‌యం త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆమె రాజీనామాతో ఖాళీ ఏర్ప‌డిన‌ పశ్చిమ బెంగాల్ ఏకైక రాజ్యసభ స్థానానికి అక్టోబర్ 16న ఉప ఎన్నిక జరగనుంది.

Also Read..

మెదడు గుట్టుపై అధ్య‌య‌నం.. ఈ ఏడాది ముగ్గురికి వైద్య నోబెల్‌

ట్వీట్ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదు సార్‌.. సీఎం రేవంత్ అక్ర‌మ సంపాద‌న‌పై విచార‌ణ జ‌రిపించండి.. మ‌న్నె క్రిషాంక్‌

స్టాక్ మార్కెట్ల‌కు ఊరట.. 472 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్..

Advertisement
Advertisement