Elephant | ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది
Elephant | ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లిన ఓ వృద్ధురాలు ఏనుగు (Elephant) దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కేరళం(Keralam)లోని కొల్లాం (Kollam) జిల్లాలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది.
Elephant | త్రినేత్ర న్యూస్ : కేరళం(Keralam)లో విషాద ఘటన చోటు చేసుకుంది. అడవి ఏనుగు (Elephant) దాడిలో 80 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. సోమవారం ఉదయం కొల్లాం (Kollam) జిల్లాలోని అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పత్తనాపురం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడశేరి నివాసి రాజమ్మ (80) ఇవాళ ఉదయం ఉపాధి హామీ పథకంలో (VB-G RAM G) భాగంగా పనికి వెళ్లింది. అక్కడ ఫొటోలు దిగుతుండగా ఒక్కసారిగా ఏనుగు వారిపైకి దూసుకొచ్చింది. తోటి కూలీలు ప్రాణ భయంతో పరుగులు తీశారు. అయితే, వయసు మీద పడటంతో రాజమ్మ పరిగెత్తలేకపోయింది. ఈ క్రమంలో ఏనుగు దాడికి బలైంది. రాజమ్మను అడవి ఏనుగు తొక్కి చంపేసింది. గజరాజును అడ్డుకునేందుకు తోటి కూలీలు ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఏనుగును అడవిలోకి తరిమి కొట్టారు. రాజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పునలూర్ తాలూకా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కూలీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏనుగుల దాడి ఘటనలు ఈ ప్రాంతంలో సర్వసాధారణం అయిపోయాయని స్థానికులు వాపోయారు. అటవీ ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్న ప్రజలు, పని నిమిత్తం వెళ్లే వాళ్లు ప్రాణాలను అరచేతిలోపెట్టుకుని తిరుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read..
మెదడు గుట్టుపై అధ్యయనం.. ఈ ఏడాది ముగ్గురికి వైద్య నోబెల్
రాజ్యసభ బరిలో ప్రముఖ నటి.. బీజేపీలో చేరిన గంటల వ్యవధిలోనే
కోహినూర్‌లో 25 శాతం వాటా తీసుకున్నవ్.. అయ్యకు అబ్బకు పుడ్తే అబద్దమని చెప్పు
సంబంధిత వార్తలు

Priyanka Gandhi Wayanad Tour | వాయనాడ్ పర్యాటకానికి కొత్త ఊపు: అడ్వెంచర్ స్పోర్ట్స్‌పై ప్రియాంక గాంధీ ప్రత్యేక దృష్టి.. యువతతో కీలక భేటీ!
సెప్టెంబర్ 30, 2026

Revanth Reddy | గాంధీ పరివార్ కోసం ప్రాణం కూడా త్యాగం చేస్తా
సెప్టెంబర్ 25, 2026

Special Trains | పండుగల వేళ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్.. ఈ రూట్లో భారీగా ప్రత్యేక రైళ్లు..!
సెప్టెంబర్ 11, 2026
తాజావార్తలు
- ●Ram Pothineni | సోషల్ మీడియాకు ఆధార్‌ను లింక్ చేయాలి - జాన్వీకపూర్ డీప్‌ఫేక్ వీడియోలపై హీరో రామ్పోతినేని పోస్ట్
- ●Stock Markets | మార్కెట్లలో భారీ కరెక్షన్.. 84 శాతం నిఫ్టీ షేర్లు 200 డీఎంఏ దిగువకు..
- ●Telangana Junior Lecturers Sacked | నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు: 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు
- ●Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- ●Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ●Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా

Ram Pothineni | సోషల్ మీడియాకు ఆధార్‌ను లింక్ చేయాలి - జాన్వీకపూర్ డీప్‌ఫేక్ వీడియోలపై హీరో రామ్పోతినేని పోస్ట్

Stock Markets | మార్కెట్లలో భారీ కరెక్షన్.. 84 శాతం నిఫ్టీ షేర్లు 200 డీఎంఏ దిగువకు..

Telangana Junior Lecturers Sacked | నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు: 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు

Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి



