త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Pothineni | సోష‌ల్ మీడియాకు ఆధార్‌ను లింక్ చేయాలి – జాన్వీక‌పూర్ డీప్‌ఫేక్ వీడియోల‌పై హీరో రామ్‌పోతినేని పోస్ట్‌

జాన్వీక‌పూర్ డీప్ ఫేక్ వివాదంపై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని రియాక్ట్ అయ్యారు. సోష‌ల్ మీడియా అకౌంట్‌కు ఆధార్‌ను లింక్ చేయాలంటూ పోస్ట్ పెట్టారు. సోష‌ల్ మీడియా వేధింపుల‌ను అరిక‌ట్ట‌డానికి అదొక్క‌టే మంచి మార్గ‌మ‌ని పేర్కొన్నారు.

N

Entertainment | Published On Oct 5, 2026, 5.09 pm IST

Ram Pothineni | సోష‌ల్ మీడియాకు ఆధార్‌ను లింక్ చేయాలి – జాన్వీక‌పూర్ డీప్‌ఫేక్ వీడియోల‌పై హీరో రామ్‌పోతినేని పోస్ట్‌
Advertisement

Ram Pothineni | దేవ‌ర సినిమాలోని చ‌ట్ట‌మ‌ల్లే సాంగ్ డీప్‌ఫేక్ వివాదం టాలీవుడ్‌ను కుదిపిస్తోంది. ఈ సాంగ్‌ను మార్ఫింగ్ చేసి జాన్వీక‌పూర్‌ను అభ్యంత‌ర‌క‌రంగా చిత్రీక‌రించ‌డాన్ని ప‌లువురు స్టార్స్ త‌ప్పుప‌డుతోన్నారు. ఏఐని దుర్వినియోగం చేస్తూ అస‌భ్య వీడియోల‌ను క్రియేట్ చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని చిరంజీవి, ఎన్టీఆర్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ప‌లువురు స్టార్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. ఈ వివాదంపై జాన్వీక‌పూర్ కూడా రియాక్ట్ అయ్యింది. ఈ డీప్‌ఫేక్ వీడియో లైంగిక దాడితో స‌మానమంటూ సుదీర్ఘ‌మైన పోస్ట్ పెట్టింది. మ‌హిళ‌లు వ‌ద్దు అంటే... ఆ వ‌ద్దును కూడా గౌర‌వించాలంటూ పేర్కొన్న‌ది.

ముఖాలు క‌నిపించ‌వు...

జాన్వీక‌పూర్ డీప్‌ఫేక్ వీడియోల‌పై టాలీవుడ్ హీరో రామ్‌పోతినేని రియాక్ట్ అయ్యారు. ఎన్టీఆర్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చారు. సోష‌ల్ మీడియాకు ఆధార్‌ను లింక్ చేయాలంటూ పేర్కొన్నారు. సోష‌ల్ మీడియాలో ముఖాలు క‌నిపించ‌వు కాబ‌ట్టే చాలా మంది భ‌యం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని రామ్ పోతినేని పేర్కొన్నాడు.

ఐడెంటిటీ ఉండ‌దు...

"సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లు చేసే వారికి స‌రైన ఐడెంటీటీ ఉండ‌దు అందుకే చాలా మంది భ‌యం, బాధ్య‌త‌ లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప్ర‌తి సోష‌ల్ మీడియా అకౌంట్‌కు వారి ఆధార్‌ను లింక్ చేయాలి. ఆన్‌లైన్ వేధింపుల‌ను అరిక‌ట్ట‌డానికి, సోష‌ల్ మీడియా యూజ‌ర్ల‌లో జ‌వాబుదారీత‌నం పెంచ‌డానికి అదొక్క‌టే మంచి మార్గం" అని త‌న పోస్ట్‌లో రామ్ పోతినేని పేర్కొన్నారు. ఎన్టీఆర్, జాన్వీక‌పూర్‌ల‌కు మ‌ద్ద‌తుగా రామ్ పెట్టిన పోస్ట్‌ వైర‌ల్ అవుతోంది.

 

Advertisement
Advertisement