Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy | వచ్చే దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి (Singareni) కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్ (Bonus) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు.
Kishan Reddy | త్రినేత్ర న్యూస్: వచ్చే దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి (Singareni) కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్ (Bonus) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. సింగరేణి పరిశ్రమ ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని.. తెలంగాణకు కొంగు బంగారమని కొనియాడారు. దేశం, తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా ఉందన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.
దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలని కోరుతున్నాను. ప్రస్తుత అవసరాలు, భవిష్యత్తు దృష్ట్యా సింగరేణి కూడా బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 60 వేల కోట్లు ఇవ్వాలి
దేశ ప్రగతిలో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి మరింత కీలకపాత్ర పోషించాలని కోరుతున్నాను. తెలంగాణ ప్రభుత్వం కూడా సింగరేణికి ఇవ్వాల్సిన రూ.60 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి. సింగరేణి కార్మికులకు, ఉద్యోగులు వారి కుటుంబసభ్యులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
అక్టోబర్ 5, 2026

Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా
అక్టోబర్ 5, 2026

Dasoju Sravan | విద్యకు పార్ట్‌టైమ్ డ్యూటీ సరిపోదు.. విద్యాశాఖ మంత్రిని పెట్టండి
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Stock Markets | మార్కెట్లలో భారీ కరెక్షన్.. 84 శాతం నిఫ్టీ షేర్లు 200 డీఎంఏ దిగువకు..
- ●Telangana Junior Lecturers Sacked | నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు: 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు
- ●Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ●Elephant | ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది
- ●Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా
- ●Dasoju Sravan | విద్యకు పార్ట్‌టైమ్ డ్యూటీ సరిపోదు.. విద్యాశాఖ మంత్రిని పెట్టండి

Stock Markets | మార్కెట్లలో భారీ కరెక్షన్.. 84 శాతం నిఫ్టీ షేర్లు 200 డీఎంఏ దిగువకు..

Telangana Junior Lecturers Sacked | నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు: 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు

Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Elephant | ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది



