Stock Markets | మార్కెట్‌లలో భారీ కరెక్షన్.. 84 శాతం నిఫ్టీ షేర్లు 200 డీఎంఏ దిగువకు..
Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న తాజా అమ్మకాల ఒత్తిడి ప్రధానంగా లార్జ్‌క్యాప్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిఫ్టీ 50లో ఏకంగా 84 శాతం షేర్లు ఇప్పుడు తమ 200 రోజుల మూవింగ్ యావరేజ్ (200 డీఎంఏ) కంటే దిగువన ట్రేడవుతున్నాయి. అయితే చిన్న, సూక్ష్మ స్థాయి షేర్లు మాత్రం తక్కువ స్థాయిలోనే కరెక్షన్‌కు గురవుతూ కొంత మెరుగైన స్థిరత్వాన్ని చూపిస్తున్నాయి.
Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న తాజా అమ్మకాల ఒత్తిడి ప్రధానంగా లార్జ్‌క్యాప్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిఫ్టీ 50లో ఏకంగా 84 శాతం షేర్లు ఇప్పుడు తమ 200 రోజుల మూవింగ్ యావరేజ్ (200 డీఎంఏ) కంటే దిగువన ట్రేడవుతున్నాయి. అయితే చిన్న, సూక్ష్మ స్థాయి షేర్లు మాత్రం తక్కువ స్థాయిలోనే కరెక్షన్‌కు గురవుతూ కొంత మెరుగైన స్థిరత్వాన్ని చూపిస్తున్నాయి. నిఫ్టీ 50లోని 50 షేర్లలో 42 షేర్లు ప్రస్తుతం 200 డీఎంఏ కంటే దిగువన ఉన్నాయి. నిఫ్టీ 500లో 310 షేర్లు, అంటే 65 శాతం షేర్లు 200 డీఎంఏ కంటే కింద ట్రేడవుతున్నాయి. విస్తృత బీఎస్ఈ 1000 సూచీలో మాత్రం 452 షేర్లు, అంటే 45 శాతం మాత్రమే ఈ కీలక స్థాయి కంటే దిగువన ఉన్నాయి.
200 డీఎంఏ అంటే..
గత 200 ట్రేడింగ్ సెషన్లలో షేర్ క్లోజింగ్ ధరల సగటుతో 200 డీఎంఏను లెక్కిస్తారు. దీన్ని షేర్ లేదా సూచీ దీర్ఘకాలిక ట్రెండ్‌ను అంచనా వేసేందుకు కీలకమైన సాంకేతిక సూచికగా మార్కెట్ నిపుణులు పరిగణిస్తారు. షేర్ 200 డీఎంఏ పైన ట్రేడైతే దీర్ఘకాలిక ట్రెండ్ సానుకూలంగా ఉన్నట్లు భావిస్తారు. అదే దాని దిగువకు పడిపోతే బలహీనతకు సంకేతంగా చూస్తారు. ఇటీవలి ఆరు నెలల్లో మార్కెట్‌లోని వివిధ విభాగాల పనితీరులో వచ్చిన వ్యత్యాసమే ఈ పరిస్థితికి కారణమని ఇండియాచార్ట్స్ వ్యవస్థాపకుడు రోహిత్ శ్రీవాస్తవ తెలిపారు. చిన్న, సూక్ష్మ స్థాయి షేర్లు గణనీయమైన ఔట్‌పెర్ఫార్మెన్స్ చూపించగా, మిడ్‌క్యాప్ షేర్లు కూడా నిఫ్టీ కంటే మెరుగైన పనితీరు కనబరిచాయని పేర్కొన్నారు. బ్లూచిప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్ షేర్లు తమ 200 డీఎంఏ స్థాయిల కంటే దాదాపు 19 శాతం దిగువన ట్రేడవుతున్నాయి. టీసీఎస్ దాదాపు 18 శాతం కింద ఉంది. హెచ్‌యూఎల్, ఐటీసీ, జియో ఫైనాన్షియల్ షేర్లు ఒక్కొక్కటి దాదాపు 17 శాతం దిగువన ఉన్నాయి.
పెద్ద షేర్లకు తప్పని నష్టాలు..
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, టాటా కన్స్యూమర్, ఓఎన్‌జీసీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కూడా తమ 200 డీఎంఏ కంటే సుమారు 14 శాతం దిగువన ట్రేడవుతున్నాయి. దీంతో మార్కెట్‌లో కొనసాగుతున్న కరెక్షన్‌లో పెద్ద కంపెనీల షేర్లే ప్రధానంగా దెబ్బతింటున్న విషయం స్పష్టమవుతోంది. ఈ బలహీనత కొంతవరకు మిడ్‌క్యాప్ షేర్లకు కూడా విస్తరించినప్పటికీ స్మాల్‌క్యాప్, మైక్రోక్యాప్ షేర్లలో మాత్రం ప్రభావం అంత తీవ్రంగా కనిపించడం లేదు. ఇది ప్రస్తుత అమ్మకాలు మొత్తం మార్కెట్‌ను సమానంగా ప్రభావితం చేయడం లేదని, ప్రధానంగా లార్జ్‌క్యాప్ విభాగంలోనే కేంద్రీకృతమై ఉన్నాయని సూచిస్తోంది. నిఫ్టీ 500లో సుమారు 190 షేర్లు ఇప్పటికీ తమ 200 డీఎంఏ పైన ట్రేడవుతున్నాయి. వీటిలో 52 షేర్లు 200 డీఎంఏ కంటే 1 నుంచి 5 శాతం పైన, 28 షేర్లు 5 నుంచి 10 శాతం పైన, 65 షేర్లు 10 నుంచి 20 శాతం పైన, 21 షేర్లు 20 నుంచి 30 శాతం పైన ఉన్నాయి. మరో 15 షేర్లు తమ 200 డీఎంఏ కంటే 30 శాతానికి పైగా ఎగువన ఉన్నాయి.

మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో మెరుగ్గా..
బీఎస్ఈ 1000లో పరిస్థితి మరింత విస్తృతంగా కనిపిస్తోంది. ఈ సూచీలో 542 షేర్లు ఇప్పటికీ తమ 200 డీఎంఏ పైన ట్రేడవుతున్నాయి. వీటిలో 97 షేర్లు 1 నుంచి 5 శాతం, 114 షేర్లు 5 నుంచి 10 శాతం, 188 షేర్లు 10 నుంచి 20 శాతం, 100 షేర్లు 20 నుంచి 30 శాతం, 43 షేర్లు 30 శాతానికి పైగా తమ 200 డీఎంఏ కంటే పైన ఉన్నాయి. చాయిస్ బ్రోకింగ్ సాంకేతిక పరిశోధన విశ్లేషకుడు హితేష్ టైలర్ మాట్లాడుతూ కరెక్షన్ అన్ని మార్కెట్ విభాగాలను సమానంగా ప్రభావితం చేయడం లేదని చెప్పారు. ప్రస్తుతం లార్జ్‌క్యాప్ షేర్లలో ఎక్కువ బలహీనత కనిపిస్తుండగా, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగాల్లోని కొన్ని షేర్లు తమ దీర్ఘకాలిక ట్రెండ్‌ను మెరుగ్గా కొనసాగిస్తున్నాయని తెలిపారు. నిఫ్టీ 500, బీఎస్ఈ 1000లో కనిపిస్తున్న వ్యాప్తి మార్కెట్ మొత్తం ఒకే విధంగా బలహీనపడడం కాకుండా, వివిధ విభాగాల మధ్య పనితీరులో వ్యత్యాసం ఉందని సూచిస్తోందని పేర్కొన్నారు.
మార్కెట్ బాటమ్ ఎప్పుడు..
అయితే 200 డీఎంఏ దిగువకు పడిపోవడం సాధారణంగా బలహీన ట్రెండ్‌కు సంకేతమైనప్పటికీ, అత్యంత తీవ్ర స్థాయికి చేరినప్పుడు అది విరుద్ధ సంకేతంగా కూడా పనిచేస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంటే భారీగా పడిపోయిన మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి చివరి దశకు చేరుకుంటే, అదే భవిష్యత్తులో మార్కెట్ బాటమ్‌కు సంకేతంగా మారే అవకాశం ఉంటుంది. బ్లూచిప్ షేర్లలో నమోదవుతున్న పతనం అతిగా మారుతున్నట్లు కనిపిస్తోందని ఇండియాచార్ట్స్ వ్యవస్థాపకుడు రోహిత్ శ్రీవాస్తవ అన్నారు. నిఫ్టీలో కనిపిస్తున్న పరిస్థితి 2020 మార్చి లేదా 2026 మార్చిలో కనిపించిన ఓవర్‌సోల్డ్ పరిస్థితులను గుర్తు చేస్తోందని ఆయన తెలిపారు. నిఫ్టీలో ఇలాంటి తీవ్ర స్థాయి బలహీనత గతంలో మార్కెట్ బాటమ్స్‌తో సంబంధం కలిగి ఉందని వివరించారు.
అన్ని విభాగాల్లో అలా లేదు..
అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో ప్రస్తుతం అదే స్థాయి ఓవర్‌సోల్డ్ పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. నిఫ్టీ 500లోని అన్ని విభాగాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మార్కెట్‌లో విస్తృత స్థాయి క్యాపిట్యులేషన్ జరిగినట్లు భావించవచ్చని, కానీ ప్రస్తుతానికి అన్ని విభాగాల్లో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని శ్రీవాస్తవ తెలిపారు. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ టెక్నికల్ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ మెహుల్ కొఠారి ప్రకారం తదుపరి కీలక సంకేతం మార్కెట్ బ్రెడ్త్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూచీలు ప్రస్తుతం కనిపిస్తున్న సపోర్ట్ స్థాయిలను నిలబెట్టుకోవడంతోపాటు, 200 డీఎంఏ కంటే దిగువన ఉన్న షేర్ల శాతం తగ్గడం ప్రారంభిస్తే మార్కెట్ పార్టిసిపేషన్ మెరుగుపడుతోందని, మార్కెట్ స్థిరీకరణకు అవకాశం ఏర్పడుతోందని అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం తమ 200 డీఎంఏకు 1 నుంచి 10 శాతం పరిధిలో ఉన్న షేర్లు కూడా క్రమంగా 10 నుంచి 30 శాతం దిగువకు జారడం ప్రారంభిస్తే, కరెక్షన్ మరింత విస్తరిస్తోందని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని కొఠారి హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్‌లో కీలకంగా గమనించాల్సిన అంశం నిఫ్టీ, సెన్సెక్స్ స్థాయిలతోపాటు ఎన్ని షేర్లు తమ 200 డీఎంఏను తిరిగి అధిగమిస్తున్నాయన్నదే ముఖ్యంగా మారింది.
తాజావార్తలు
- ●Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- ●Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ●Elephant | ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది
- ●Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా
- ●Dasoju Sravan | విద్యకు పార్ట్‌టైమ్ డ్యూటీ సరిపోదు.. విద్యాశాఖ మంత్రిని పెట్టండి
- ●Aadarsha Kutumbam Postpone | వెంకటేష్ ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా - అక్టోబర్ రేసు నుంచి ఔట్?

Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Elephant | ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది

Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా






