Dasoju Sravan | విద్యకు పార్ట్‌టైమ్ డ్యూటీ సరిపోదు.. విద్యాశాఖ మంత్రిని పెట్టండి
Dasoju Sravan | విద్యకు పార్ట్‌టైమ్ దృష్టి సరిపోదని.. పూర్తికాల విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. బడుల మూసివేత, విలీనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
- బడుల మూసివేత, విలీనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
- విద్యకు 15% కేటాయించి.. 18% చేరే రోడ్‌మ్యాప్ రూపొందించాలి
- సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Dasoju Sravan | త్రినేత్ర న్యూస్: విద్యకు పార్ట్‌టైమ్ దృష్టి సరిపోదని.. పూర్తికాల విద్యాశాఖ మంత్రిని నియమించాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. బడుల మూసివేత, విలీనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్య కోసం 15 శాతం బడ్జెట్ కేటాయించి.. 18 శాతానికి చేరేలా రోడ్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పదోన్నతుల క్యాలెండర్, సర్వీస్ రూల్స్, డీఈవో, ఎంఈవో నియామకాలను వెంటనే చేపట్టాలన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం తెలంగాణ విద్యారంగా సంక్షోభంపై ఆయన సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
మీకు విద్యావ్యవస్థలో ఉన్న కఠిన వాస్తవ స్థితిగతులను మీ దృషికి తీసుకొస్తున్నాను. ఈరోజు ప్రపంచమంతా ఉపాధ్యాయుల పక్షాన నిలబడుతోంది. కానీ తెలంగాణలో మాత్రం ఉపాధ్యాయులు జీతాల కోసం రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. నిరుద్యోగ బీఎడ్ అభ్యర్థులు రాని డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. వేలాది బడుల్లో పిల్లలు ఒక్క టీచర్‌తో చదువు నెట్టుకొస్తున్నారు.
ఇవీ మా ప్రధాన డిమాండ్లు..
1. మెగా డీఎస్సీ తక్షణమే ప్రకటించాలి. ఇకపై స్థిరమైన క్యాలెండర్‌తో ఏటా డీఎస్సీ నిర్వహించాలి
2. బడుల మూసివేత, విలీనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
3. ప్రతి బడికి కనీసం ఇద్దరు టీచర్లు ఉండాలి (ప్రతి హైస్కూల్, జూనియర్ కాలేజీలో సబ్జెక్ట్ టీచర్స్)
4. కాంట్రాక్ట్ బోధనకు స్వస్తి పలికి రెగ్యులర్ పోస్టుల ద్వారా సిబ్బందిని నియమించి, గౌరవ వేతనం ఇవ్వాలి
5. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, పదోన్నతుల క్యాలెండర్, సర్వీస్ రూల్స్, డీఈవో, ఎంఈవో నియామకాలు చేపట్టాలి
6. విద్యకు 15% కేటాయించి, తర్వాత 18% చేరే రోడ్‌మ్యాప్
7. విద్యకు పార్ట్‌టైమ్ దృష్టి సరిపోదు. విశ్వవిద్యాలయ ఖాళీలను ఒక్క విద్యా సంవత్సరంలో భర్తీ చేసే బాధ్యత ఆయనకే అప్పగించాలి.
8. ప్రైవేట్ స్కూల్స్, విద్యా సంస్థలలో దోపిడీని అరికట్టాలి.
సంబంధిత వార్తలు

Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
అక్టోబర్ 5, 2026

Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
అక్టోబర్ 5, 2026

Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా
అక్టోబర్ 5, 2026
తాజావార్తలు
- ●Stock Markets | మార్కెట్లలో భారీ కరెక్షన్.. 84 శాతం నిఫ్టీ షేర్లు 200 డీఎంఏ దిగువకు..
- ●Telangana Junior Lecturers Sacked | నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు: 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు
- ●Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- ●Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
- ●Elephant | ఉపాధి హామీ పథకం పనులకు వెళ్తే.. ఏనుగు చంపేసింది
- ●Vote for Note Case | ఓటుకు నోటు కేసులో కీలక మలుపు: సుప్రీంకోర్టులో స్టీఫెన్సన్ ఇంప్లీడ్ పిటిషన్.. విచారణ 10 రోజులు వాయిదా

Stock Markets | మార్కెట్లలో భారీ కరెక్షన్.. 84 శాతం నిఫ్టీ షేర్లు 200 డీఎంఏ దిగువకు..

Telangana Junior Lecturers Sacked | నకిలీ సర్టిఫికెట్లతో కొలువులు: 35 మంది జూనియర్ లెక్చరర్లపై వేటు

Kishan Reddy | సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250ల బోనస్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Gaddam Vamsi Krishna | ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కాకా కల.. యువతకు ఉపాధి కల్పించేలా కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ






