త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | మోదీ 25 ఏళ్ల ప్ర‌జా జీవితం.. బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రజా జీవితంలోకి (public office) అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న (PM Modis 25 years in public service) సందర్భంగా బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. నెల రోజుల‌పాటూ దేశ వ్యాప్తంగా సేవా సంక‌ల్ప అభియాన్ (Seva Sankalp Abhiyan) పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించింది.

D

National | Published On Sep 9, 2026, 2.53 pm IST

PM Modi | మోదీ 25 ఏళ్ల ప్ర‌జా జీవితం.. బీజేపీ కీల‌క ప్ర‌క‌ట‌న‌
Advertisement

PM Modi | త్రినేత్ర‌.న్యూస్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రజా జీవితంలోకి (public office) అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న (PM Modis 25 years in public service) సందర్భంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ (BJP) ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌కు శ్రీ‌కారం చుట్టింది. నెల రోజుల‌పాటూ దేశ వ్యాప్తంగా సేవా సంక‌ల్ప అభియాన్ (Seva Sankalp Abhiyan) పేరుతో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించింది.

ఇవాళ ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్ మాట్లాడారు. అక్టోబ‌ర్ 7 నాటికి ప్ర‌ధాని మోదీ రాజ్యాంగబద్ధమైన ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చి 25 ఏళ్లు పూర్త‌వుతుంద‌ని తెలిపారు. ఈ సందర్భాన్ని పుర‌స్క‌రించుకొని దేశ వ్యాప్తంగా రక్త‌దానం, స్వ‌చ్ఛ‌తా కార్య‌క్ర‌మాలు, ఆరోగ్య శిబిరాలతోపాటూ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్ర‌ద‌ర్శ‌న‌లు, స‌ద‌స్సులు వంటి ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. మోదీ 25 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని, ఆయ‌న పాల‌నా తీరు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌తిబింబించేలా ఫొటో, డిజిట‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను సైతం ఏర్పాటు చేయనున్న‌ట్లు తెలిపారు. ప్ర‌ధాని మోదీ పుట్టిన‌రోజైన సెప్టెంబ‌ర్ 17 నుంచి సేవా సంకల్ప అభియాన్ కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వ‌చ్చే అక్టోబ‌ర్ 17 వ‌ర‌కూ దేశ‌వ్యాప్తంగా ఇవి కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు.

కాగా, ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అక్టోబ‌ర్ 7, 2001న తొలిసారి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే. 2014 వ‌ర‌కూ గుజ‌రాత్ సీఎంగానే కొన‌సాగారు. అనంత‌రం 2014 మే 26న భార‌త ప్ర‌ధాన మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అప్ప‌టి నుంచి వ‌రుస‌గా మూడో ప‌ర్యాయం ఆయ‌న ప్ర‌ధానిగా కొనసాగుతూ దేశాన్ని ముందుకు న‌డిపిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబ‌ర్ 7 నాటికి మోదీ రాజ్యాంగబద్ధమైన ప్ర‌జా జీవితంలోకి వ‌చ్చి 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌బోతోంది.

Also Read..

ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి

పేలిన ఆక్సిజ‌న్ సిలిండ‌ర్‌.. ఒక‌రు మృతి

ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్క‌డో తెలుసా?

Advertisement
Advertisement