BRICS Summit | బ్రిక్స్ సమ్మిట్.. ఈనెల 11న మోదీ-పుతిన్ భేటీ
BRICS Summit | సెప్టెంబర్ 11వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi )తో రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అధికారికంగా వెల్లడించారు.
BRICS Summit | త్రినేత్ర.న్యూస్ : ఈ ఏడాది 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి (BRICS Summit) భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమ్మిట్‌కి ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సైతం బ్రిక్స్ సమావేశం కోసం న్యూఢిల్లీ రాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో పుతిన్ సమావేశం కానున్నారు.
బ్రిక్స్ సమావేశానికి ముందు అంటే సెప్టెంబర్ 11వ తేదీన ప్రధాని మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. రష్యాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి అని చెప్పారు. న్యూఢిల్లీని అత్యంత ముఖ్యమైన మిత్రదేశంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. రక్షణ, ఇంధనం, రవాణా, శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో ఇరుదేశాల మధ్య సహకారం విస్తరిస్తోందని పెస్కోవ్ పేర్కొన్నారు. కొత్త అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుపై భారత్‌తో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తమ ఎజెండాలో భారత్కు ఎస్యూ-57 విమానాల విక్రయం కూడా ఉందని తెలిపారు.
ఈ ఏడాది భారత్ అధ్యక్షతన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ''బలమైన భవిష్యత్తు కోసం స్థిరత్వం, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత'' అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరగనుంది. సెప్టెంబరు 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ప్రస్తుతం బ్రిక్స్ కూటమిలో భారత్‌తో పాటు బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేషియా సహా మొత్తం 11 సభ్య దేశాలు ఉన్నాయి.
Also Read..
ఢిల్లీలో 38% భవనాలు రిస్క్‌లోనే.. భూకంపం వస్తే అంతే సంగతులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు
సంబంధిత వార్తలు

PM Modi | 10 ఏళ్లలో 50 వేల మరుగుదొడ్లను కూడా నిర్మించలేకపోయారు : ప్రధాని మోదీ
సెప్టెంబర్ 8, 2026

PM Modi | కొత్త శిఖరాలకు భారత్-ఫ్రాన్స్ సంబంధాలు : ప్రధాని మోదీ
సెప్టెంబర్ 7, 2026

PM Modi SRCC Speech | 13 ఏళ్ల తర్వాత అదే వేదిక.. మళ్లీ అదే ‘గ్లాస్’ కథ.. ఆ కాలేజీలో ప్రధాని మోదీ ఆసక్తికర ప్రసంగం
సెప్టెంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Telangana Women's Commission | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు
- ●Pithapuramlo | సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో… అలా మొదలైంది’
- ●BJP Memorandum to Governor | ఫీజు బకాయిలు విడుదలయ్యేలా చూడండి.. గవర్నర్కు బీజేపీ వినతి
- ●Stock Markets | ముడి చమురు ధరల మంట.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..
- ●TTD | తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- ●Delhi buildings | ఢిల్లీలో 38% భవనాలు రిస్క్‌లోనే.. భూకంపం వస్తే అంతే సంగతులు

Telangana Women's Commission | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్‌కు కాంగ్రెస్ మహిళా నేతల ఫిర్యాదు

Pithapuramlo | సెప్టెంబర్ 18న ‘పిఠాపురంలో… అలా మొదలైంది’

BJP Memorandum to Governor | ఫీజు బకాయిలు విడుదలయ్యేలా చూడండి.. గవర్నర్కు బీజేపీ వినతి

Stock Markets | ముడి చమురు ధరల మంట.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు..



