Bhatti Vikramarka – Sridhar Babu | కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలి.. ఆయన చావు మేమెందుకు కోరుకుంటాం?
ప్రతిపక్ష నేత కేసీఆర్ నూరేళ్లకు పైగా బతకాలని కాంగ్రెస్ కోరుకుంటుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. దళితులు నడిస్తే రోడ్లను శుద్ధి చేస్తారా అని భట్టి ఫైర్ అయ్యారు.
సంక్షిప్త సారాంశం
కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలని, ఆయన చావును కాంగ్రెస్ ఎన్నటికీ కోరుకోదని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. స్పీకర్‌ను దూషించినందుకు నిరసన తెలిపిన దళితులు నడిచిన రోడ్లను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దుర్మార్గమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభలో అన్‌రూల్డ్ బిహేవియర్‌తో స్పీకర్‌ను ఇంటిమిడేట్ చేయడం మానుకోవాలని మంత్రులు హితవు పలికారు. తాము బార్బరిక్ సొసైటీలో లేమని, సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నామని, దొరతనపు పోకడలను తెలంగాణ సమాజం భరించదని హెచ్చరించారు.
- కేసీఆర్ బాగుండాలి
- 100 ఏళ్లు బతకాలి
- అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు
Bhatti Vikramarka - Sridhar Babu | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీలో (Telangana Assembly) అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సభాపతి స్థానాన్ని అగౌరవపరుస్తూ బీఆర్ఎస్ సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ (KCR) ఆరోగ్య వ్యవహారంపై వస్తున్న విమర్శలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (D. Sridhar Babu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నిండు నూరేళ్లు బతకాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామంటూ సభలో స్పష్టం చేశారు.
కేసీఆర్ 100 ఏళ్లు బతకాలి.. ఎవరి చావునూ కోరుకోం
బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. "ఎవరి చావును ఎవరూ కోరుకోరు అధ్యక్షా. అందరూ బాగుండాలనే అనుకుంటాం. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారు బాగుండాలి. ఆయన 100 ఏళ్లకు పైబడి బతకాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి ఆయన డైరెక్షన్‌లో సేవలు అందాలని కోరుకుంటాం తప్ప.. ఆయన చావును మేమెందుకు కోరుకుంటాం?" అని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.
రాజకీయంగా ఎవరినైనా అసభ్య పదజాలంతో దూషించడాన్ని తమ ప్రభుత్వం ఎండోర్స్ (Endorse - సమర్థించడం) చేయదని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీనైనా, కేసీఆర్‌నైనా దూషించడాన్ని తాము సమర్థించబోమన్నారు. అయితే, గతంలో కరీంనగర్‌లో రాహుల్ గాంధీని ఉద్దేశించి "అక్కడేం చస్తున్నవు రాహుల్ గాంధీ" అని బీఆర్ఎస్ నేతలు అన్నప్పుడు మాత్రం వారెందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎవరి చావు కోరుకునే పార్టీ కాదని, రాజకీయంగానే పోరాడుతుందని స్పష్టం చేశారు.
దళితులు నడిస్తే పసుపు నీళ్లతో శుద్ధి చేస్తారా?: భట్టి
సభలో దళితుల అవమానంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బీఆర్ఎస్ తీరును తీవ్రంగా ఎండగట్టారు. "స్పీకర్‌ను, ఆయన తల్లిని బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన దూషించారు. ఆ దళితుడికి జరిగిన అవమానానికి నిరసనగా దళితులు రోడ్డు మీద నడిస్తే.. ఆ రోడ్లను పసుపు నీళ్లతో శుద్ధి చేసిన దుర్మార్గపు చరిత్ర ఆ పార్టీది" అని మండిపడ్డారు. రూల్ 338 ప్రకారం మంత్రి లక్ష్మణ్ కుమార్ ఈ శుద్ధీకరణ ఘటనపై స్టేట్‌మెంట్ ఇచ్చారని శ్రీధర్ బాబు సైతం గుర్తుచేశారు.
సమాజం దశాబ్దాలుగా ఎంతో రిఫార్మ్ అయిందని, కానీ బీఆర్ఎస్ నేతలు మళ్లీ మధ్యయుగాల నాటి దొరతనపు పోకడలను తెస్తున్నారని భట్టి విమర్శించారు. "మనం సివిలైజ్డ్ సొసైటీలో (Civilized Society) ఉన్నామా? బార్బరిక్ సొసైటీలో (Barbaric Society) ఉన్నామా? తెలంగాణ సమాజం సెల్ఫ్ రెస్పెక్ట్ (Self Respect) మీద ఏర్పడింది. ఈ హ్యుమిలియేషన్ అండ్ ఇన్సల్ట్ (Humiliation and insult) దళితులు ఎందుకు భరించాలి?" అని భట్టి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేళ్లు చూపించి ఇంటిమిడేట్ (Intimidate) చేస్తే ఇక్కడ ఎవరూ భయపడరని, మీ చాలెంజ్ లకు బెదిరేవారు లేరని తేల్చిచెప్పారు. దాడులకు వ్యతిరేకంగా దళిత సమాజం ఉద్యమించే పరిస్థితి వస్తుందని, దళితుల ఆత్మగౌరవాన్ని ఈ ప్రభుత్వం నిలబెడుతుందని భట్టి స్పష్టం చేశారు.
సభ నడవనివ్వండి.. అన్‌రూల్డ్ బిహేవియర్ వద్దు
సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ సభ్యులు పదే పదే అవమానిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. స్పీకర్ వెల్‌లోకి వెళ్లి ఆర్గ్యూ (Argue) చేయడం, ఛాలెంజ్ చేయడం కరెక్ట్ కాదన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న సీనియర్లు, మంత్రులుగా పనిచేసిన వారు ఇలా అన్‌రూల్డ్ బిహేవియర్ (Unruly behavior) ప్రదర్శించడం సభ్యసమాజానికే అవమానకరమన్నారు.
సభను సజావుగా నడపడానికి సహకరించాలని హరీష్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సభ ద్వారా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కావాలంటే సలహాలు, సూచనలు ఇవ్వాలని, ఎంఐఎం, బీజేపీ, సీపీఐ సభ్యులకు క్వశ్చన్ అవర్, షార్ట్ డిస్కషన్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటే ఎలా అని మంత్రులు ప్రశ్నించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | శాసనసభ కాదు.. కౌరవ సభ
- ●Telangana Assembly | శాసనసభ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్రకారం నడుస్తుందా..?
- ●Samsung Galaxy Tab S10 Plus | గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే..
- ●Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి
- ●Ekta Ratod | టాలీవుడ్లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?
- ●స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

KTR | శాసనసభ కాదు.. కౌరవ సభ

Telangana Assembly | శాసనసభ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్రకారం నడుస్తుందా..?

Samsung Galaxy Tab S10 Plus | గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే..

Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి





