త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్‌.. ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది!

Nivetha Thomas | టాలీవుడ్‌లో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల ట్రెండ్‌ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో టాలెంటెడ్‌ హీరోయిన్‌ నివేదా థామస్‌ కూడా ఓ ఇంట్రెస్టింగ్‌ స్టోరీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధ‌మైంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశారు.

P

Entertainment | Published On Sep 9, 2026, 3.01 pm IST

Nivetha Thomas | ’శ్రీమతి’గా నివేదా థామస్‌.. ఫస్ట్‌లుక్‌ అదిరిపోయింది!
Advertisement

Nivetha Thomas | టాలీవుడ్‌లో ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల ట్రెండ్‌ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో టాలెంటెడ్‌ హీరోయిన్‌ నివేదా థామస్‌ కూడా ఓ ఇంట్రెస్టింగ్‌ స్టోరీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధ‌మైంది. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేశారు. నివేదా లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘శ్రీమతి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటు మేకర్స్‌ ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు.

హోం మేక‌ర్‌గా..

ఇందులో నివేదా పూర్తిగా హోమ్‌మేకర్‌ లుక్‌లో క‌నిపించింది. కిచెన్‌లో నడుముపై చేయి వేసుకుని నిల్చున్న ఆమె వెనుక కిచెన్‌ సామగ్రి, స్టవ్‌, వంట పాత్రలు, కప్పులు దర్శనమిచ్చాయి. పోస్టర్‌ చూస్తుంటే ఓ సాధారణ గృహిణి జీవితంలో చోటుచేసుకునే సంఘటనలు, భావోద్వేగాల చుట్టూ కథ సాగనున్నట్లు అర్థమవుతోంది. ‘ప్రతి ఇంటి హృదయం నుంచీ ఒక కథ ఉద్భవిస్తుంది.. అది మనందరికీ తెలిసిన, మనం ప్రేమించే.. మనం జీవించే కథ’ అంటూ మేకర్స్‌ ఇచ్చిన క్యాప్షన్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేస్తూ.. ప్రతి ఇంటికీ కనెక్ట్‌ అయ్యే ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

‘35 చిన్న కథ కాదు’ తర్వాత..

నివేదా థామస్‌ చివరిసారిగా 2024లో వచ్చిన ‘35 చిన్న కథ కాదు’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో ఆమె నటనకు ఆడియన్స్‌తో పాటు క్రిటిక్స్‌ నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్‌ ఇచ్చిన నివేదా.. ఇప్పుడు ‘శ్రీమతి’తో మళ్లీ వెండితెరపై సందడి చేయనున్నారు. ‘స్కైలాబ్‌’ ఫేమ్‌ విశ్వక్‌ ఖండేరావు ఈ శ్రీ‌మ‌తి మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నివేదాను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్‌లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు ఫస్ట్‌లుక్‌ ద్వారా తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్‌ త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement
Advertisement