త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్క‌డో తెలుసా?

Irumudi | మాస్‌ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషనల్‌ సక్సెస్‌ అందుకున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం.. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది.

P

Entertainment | Published On Sep 9, 2026, 1.28 pm IST

Irumudi | ఓటీటీలోకి ‘ఇరుముడి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్క‌డో తెలుసా?
Advertisement

Irumudi | మాస్‌ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషనల్‌ సక్సెస్‌ అందుకున్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం.. వసూళ్ల పరంగానూ సత్తా చాటింది. ఇప్పటికే రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన ‘ఇరుముడి’.. ఇతర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ థియేటర్లలో డీసెంట్‌ రన్‌ కొనసాగిస్తోంది.

తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని..

తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. తన గత జీవితానికి దూరంగా ఉండాలనుకునే ఓ వ్యక్తి.. కూతురి కోరిక మేరకు అయ్యప్ప దీక్ష చేపట్టడంతో అతడి జీవితంలో చోటుచేసుకునే మార్పుల చుట్టూ కథ సాగుతుంది. ఆధ్యాత్మికత, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్‌ అంశాలను మేళవిస్తూ దర్శకుడు శివ నిర్వాణ కథను నడిపించారు. ముఖ్యంగా తండ్రి, కూతురి మధ్య వచ్చే ఎమోషనల్‌ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక రవితేజ తనకు అలవాటైన మాస్‌ యాక్షన్‌తో పాటు ఈ సినిమాలో ఎమోషనల్‌ యాంగిల్‌లోనూ మెప్పించారు. కూతురితో అనుబంధాన్ని చూపించే సన్నివేశాల్లో ఆయన నటనకు మంచి స్పందన లభించింది. బేబీ నక్షత్ర కూడా కీలక పాత్రలో ఆకట్టుకుంది. రవితేజ, బేబీ నక్షత్ర మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రియా భవానీ శంకర్‌, సాయికుమార్‌, రమేశ్‌ ఇందిర, స్వాసిక విజయ్‌ తదితరులు తమ పాత్రల పరిధిలో మంచి పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు.

ఓటీటీ రిలీజ్‌పై ఆస‌క్తి..

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు. కథలోని ఎమోషనల్‌ సన్నివేశాలకు అనుగుణంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌గా నిలిచింది. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్‌ రన్‌లో మంచి ఫలితాలను అందుకోవడంతో ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై కూడా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. ‘ఇరుముడి’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి ప్రస్తుతం ఆసక్తికరమైన బజ్‌ వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 18, 2026 నుంచి ‘ఇరుముడి’ని స్ట్రీమింగ్‌కు తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. తెలుగు సహా పలు భాషల్లో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సెప్టెంబర్‌ 18 స్ట్రీమింగ్‌?

అయితే, సెప్టెంబర్‌ 18 స్ట్రీమింగ్‌ డేట్‌పై ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక అనౌన్స్‌మెంట్‌ రాలేదు. దీంతో ఈ తేదీపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. థియేటర్లలో ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ సొంతం చేసుకున్న నేపథ్యంలో ఓటీటీలోనూ ‘ఇరుముడి’కి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులతో పాటు రవితేజ అభిమానులు డిజిటల్‌ రిలీజ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటిన ‘ఇరుముడి’.. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్‌ అందుకుంటుందో చూడాలి. నెట్‌ఫ్లిక్స్‌ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత స్ట్రీమింగ్‌ తేదీతో పాటు ఏయే భాషల్లో సినిమా అందుబాటులోకి వస్తుందనే విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement