త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramachander Rao | రాజ‌కీయ నాట‌కాల‌కు వేదిక‌గా అసెంబ్లీ : రామ‌చంద‌ర్ రావు

Ramachander Rao | గత రెండు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీని రాజకీయ నాటకాలకు వేదికగా మార్చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు ధ్వ‌జ‌మెత్తారు. ఇదే సమయంలో ప్రజలను వేధిస్తున్న కీలక సమస్యలు మాత్రం చర్చకు నోచుకోవడం లేదు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

S

Telangana | Published On Sep 9, 2026, 3.00 pm IST

Ramachander Rao | రాజ‌కీయ నాట‌కాల‌కు వేదిక‌గా అసెంబ్లీ : రామ‌చంద‌ర్ రావు
Advertisement

Ramachander Rao | త్రినేత్ర‌.న్యూస్ : గత రెండు రోజులుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీని రాజకీయ నాటకాలకు వేదికగా మార్చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రామ‌చంద‌ర్ రావు ధ్వ‌జ‌మెత్తారు. ఇదే సమయంలో ప్రజలను వేధిస్తున్న కీలక సమస్యలు మాత్రం చర్చకు నోచుకోవడం లేదు అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, 22-A భూముల సమస్య, పెండింగ్ డీఏలు, పీఆర్సీతో పాటు లక్షలాది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న అనేక అంశాలపై సభలో గంభీరమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రజా సమస్యలపై చర్చించాలనే ఆసక్తి లేదు; వారికి కావాల్సింది కేవలం రాజకీయ నాటకాలే. ప్రజల పక్షాన బీజేపీ పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు తగిన సమయంలో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు అని రామ‌చంద‌ర్ రావు హెచ్చ‌రించారు.

Advertisement
Advertisement