Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోకు తల్లిగా దీపికా పడుకోణ్ – అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్ కన్ఫామ్!
రణ్‌భీర్‌కపూర్, అలియాభట్ బ్లాక్‌బస్టర్ మూవీ బ్రహ్మాస్త్రకు సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. రణ్‌భీర్‌కపూర్‌గా తల్లిగా ఈ బ్యూటీ కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Aug 20, 2026, 2.55 pm IST
Deepika Padukone | రణ్‌భీర్‌కపూర్, అలియా భట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీ సీక్వెల్‌పై ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ బాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సూపర్ హీరో ఫాంటసీ మూవీలో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పడుకోణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
రామాయణ తర్వాత...
రణ్‌భీర్‌కపూర్ హీరోగా నటించిన రామాయణ ఈ ఏడాది దీపావళికి థియేటర్లలోకి రాబోతుంది. రెండు పార్ట్‌లుగా తెరకెక్కుతోన్న ఈ మైథాలజీ మూవీ షూటింగ్‌ను రణ్‌భీర్ కంప్లీట్ చేశారు. రామాయణ తర్వాత బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో ఈ బాలీవుడ్ హీరో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సీక్వెల్ సెట్స్‌పైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
తల్లి పాత్రలో...
బ్రహ్మాస్త్ర 2లో బాలీవుడ్ అగ్ర నాయిక దీపికా పడుకోణ్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. రణ్‌భీర్ తల్లి పాత్రలో ఈ బ్యూటీ కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఇందులో దేవ్, శివ అనే తండ్రీకొడుకులుగా రణ్‌భీర్ కనిపించబోతున్నారు. శివ తల్లిగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో దీపికా పడుకోణ్ పాత్ర కనిపిస్తుందని సమాచారం. దేవ్ పాత్రకు జోడీగా దీపికా పడుకోణ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని అంటున్నారు.
ఐదు వందల కోట్ల బడ్జెట్...
ఇటీవలే ఈ పాత్రతో దీపికా పడుకోణ్‌ను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అప్రోచ్ అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. షూటింగ్ మొదలుకావడానికి మరో ఎనిమిది నెలల వరకు టైమ్ ఉండటం దీపికా ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో బ్రహ్మాస్త్ర 2ను తెరకెక్కించనున్నట్లు సమాచారం.
నాగార్జున, అమితాబ్ బచ్చన్...
బ్రహ్మాస్త్రలో అమితాబ్‌బచ్చన్, నాగార్జునతో పాటు బాలీవుడ్, దక్షిణాదికి చెందిన పలువురు పాపులర్ యాక్టర్స్ నటించారు. సీక్వెల్‌లోనూ వీరి పాత్రలను కంటిన్యూ చేయనున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ రాకా...
ప్రస్తుతం అల్లు అర్జున్ రాకాలో హీరోయిన్‌గా నటిస్తోంది దీపికా పడుకోణ్. ప్రెగ్నెన్సీ కారణంగా ఆగస్ట్ నెలాఖరుతో ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తికానున్నట్లు సమాచారం. రాకాలో దీపికా పడుకోణ్‌తో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా
- ●Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా..?
- ●Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే
- ●Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Amit Shah | స్వాతంత్య్ర సమరయోధులను కాంగ్రెస్ అవమానిస్తోంది : అమిత్ షా

Gunja Renuka | కొండా సుష్మిత.. కాంగ్రెస్‌లో కవిత అవుదాం అనుకుంటుందా..?

Alleti Maheshwar Reddy | పొంగులేటి రాజీనామా చేయాల్సిందే

Google AI | విద్యార్థులకు గూగుల్ బంపర్ ఆఫర్.. ఏడాదిపాటు జెమిని ఏఐ ప్లాన్ ఫ్రీ..






