త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gunja Renuka | కొండా సుష్మిత‌.. కాంగ్రెస్‌లో క‌విత అవుదాం అనుకుంటుందా..?

Gunja Renuka | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత‌పై తెలంగాణ రాష్ట్ర వడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మ‌న్ గుంజా రేణుక తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సుష్మిత‌.. కాంగ్రెస్‌లో క‌విత అవుదాం అనుకుంటుందా..? అని ఆమె ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Aug 20, 2026, 2.48 pm IST

Gunja Renuka | కొండా సుష్మిత‌.. కాంగ్రెస్‌లో క‌విత అవుదాం అనుకుంటుందా..?
Advertisement

Gunja Renuka | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత‌పై తెలంగాణ రాష్ట్ర వడ్డెర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మ‌న్ గుంజా రేణుక తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సుష్మిత‌.. కాంగ్రెస్‌లో క‌విత అవుదాం అనుకుంటుందా..? అని ఆమె ప్ర‌శ్నించారు. సీఎం రేంత్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు చేసిన నేప‌థ్యంలో సుష్మిత‌ను ల‌క్ష్యంగా చేసుకుని రేణుక ఈ వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ‌లో ప‌టేల్, ప‌ట్వారీ వ్య‌వ‌స్థ ఇంకా ఉంద‌ని సుష్మిత ప‌టేల్ అనుకుంటుంది. ఇంకో సారి సుష్మిత రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే ఎక్కడ ఉన్నా పట్టుకొని కర్రు కాల్చి వాత పెడతామ‌ని హెచ్చ‌రించారు. వార్డు మెంబ‌ర్‌గా కూడా గెల‌వలేని సుష్మిత‌.. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి ఆమెకు లేద‌ని నిప్పులు చెరిగారు.

కొండా సురేఖ ముందు కూతురును అదుపులో పెట్టుకోవాలి. బ్లాక్ మెయిల్ చేస్తా అంటే ఇక్కడ నడవదు. మేము కొండత చేసిన కూడా గోరంత కూడా చెప్పుకోలేక పోతున్నాం. చేసింది చెప్పుకోలేక పోవడం మా పొరపాటు అని గుంజా రేణుక అన్నారు.

Advertisement
Advertisement